Bigg Boss 9 Telugu Ritu Choudhary: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఒక వింత జీవిగా అడుగుపెట్టిన వ్యక్తి మాస్క్ మ్యాన్ హరీష్. ఇతనికి నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ తో జనాలందరికీ వచ్చిన క్లారిటీ ఏమిటంటే, ఈయనకు ఆడవాళ్లు అంటే అసలు గౌరవమే లేదు. మూర్ఖుడు, నోటికి ఎదోస్తే అది మాట్లాడుతూ ఉంటాడు అని అందరికీ అర్థం అయిపోయింది. ఎందుకంటే శనివారం ఎపిసోడ్ లో ఈ మాస్క్ మ్యాన్ అనే సైకో మ్యాన్ నోటికొచ్చినట్టు ఇమ్మానుయేల్ మరియు భరణి మాట్లాడిన మాటలకు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఛీ కొట్టినప్పటికీ కూడా ఇతనికి హౌస్ లో సపోర్టు గా నిల్చిన ఏకైక కంటెస్టెంట్ ఒక రీతూ చౌదరి మాత్రమే. ఇంత మంది ఇతని గురించి బ్యాడ్ గా అనుకుంటున్నారు, ఇతనికి సపోర్టు చేస్తే మనం కూడా బ్యాడ్ అవుతాము ఏమో అనే భయం ఇసుమంత కూడా లేకుండా, తనకు ఏది అనిపిస్తే అదే చేసింది.
అందుకు ఈ మాస్క్ మ్యాన్ హరీష్ కృతజ్ఞతగా ఉంటాడని అనుకుంటే, ఈరోజు ఆమె నామినేషన్ వేసినందుకు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడాన్ని చూసి,అసలు ఇతను ఏమి మనిషి రా బాబు అని అనిపించింది. ఇతను ఇష్టమొచ్చినట్టు మాట్లాడే మాటలకు ఆ అమ్మాయి మనసు నొచ్చుకొని ఏడుస్తూ మాట్లాడుతుంటే, సింపతీ డ్రామా ఆడకండి అంటూ మరోసారి ఆమె పై నోరు జారాడు. ఎంతో ధైర్యం గా ఇతని కోసం స్టాండ్ తీసుకొని నిలబడినందుకు, ఆమెకు కృతజ్ఞత చూపించకపోయిన పర్వాలేదు, కనీసం మర్యాద కూడా లేదా?, ఆమె ఎమోషన్స్ కి విలువే లేదా?, అసలు ఏమి మనిషి ఇతను అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ రీతూ చౌదరి ఇతన్ని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఏంటంటే.. మీ పై ఒక ముద్ర పడింది, దానిని హౌస్ మేట్స్ అందరూ తప్పు బట్టారు, కానీ నాకు తప్పు అనిపించలేదు. అయితే మీ మీద పడిన ముద్ర ని చెరిపివేసుకొని బయటకి వెళ్ళాలి కానీ, నేను బిగ్ బాస్ నుండి వెళ్ళిపోతాను అనడం నాకు నచ్చలేదు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అంటుంది.
ఇందులో ఏమైనా తప్పు ఉందా?, దీనికి ఈ మాస్క్ మ్యాన్ ఇచ్చిన బలుపు సమాధానం ఏమిటంటే ‘హౌస్ లో ఎలా ఉండాలో, ఎలా ఆడాలో అది నా ఇష్టం..నీకు ఇష్టమున్నట్టు ఉండడానికి నేను హౌస్ లోకి రాలేదు. అర్థమైందా?’ అంటూ చాలా పొగరుగా సమాధానం చెప్పాడు. ఆ అమ్మాయి ఎంత మర్యాదగా చెప్పింది, ఇతను ఎంత అమర్యాదగా, బలుపుతో సమాధానం చెప్పాడు?, అసలు ఇలాంటి క్యారక్టర్ ని ఎంచుకొని జనాల మీదకు వదిలిన జ్యూరీ ని అనాలని ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మాట మాట పెరిగి గొడవ పెద్దది అయ్యాక, అసలు ఇంట్లో గొడవలు మొదలైందే మీ వల్ల అంటూ ఆమెపై నోరు పారేసుకున్నాడు. ఇలా ఒక్కసారిగా మాస్క్ మ్యాన్ తన అసలు మాస్క్ ని తీసేసి నేను సైకో మ్యాన్ అని జనాలకు తన ముఖాన్ని చూపించుకున్నాడు.