Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్( Bigg Boss 9 Telugu) హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో విన్నర్ అయ్యేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఇమ్మానుయేల్ ముందు వరుస లో ఉంటాడు. ఒక కమెడియన్ లో ఇంత టాలెంట్ ఉంటుందా?, ఫిజికల్ టాస్కులు అద్భుతంగా ఆడగలడు, తెలివిగా అలోచించి స్ట్రాటజీలు వేయగలడు, ఎంతటి కష్టమైన టాస్క్ వచ్చినా వెనక్కి తగ్గేదిలేదు అనే యాటిట్యూడ్ తో, గేమ్ ని గేమ్ లాగా ఆడే కంటెస్టెంట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు ఇమ్మానుయేల్. కానీ ఈయనకు ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏమిటంటే సేఫ్ గేమ్. ఆ సేఫ్ గేమ్ కారణంగానే 9 వారాల నుండి నామినేషన్స్ లోకి రావడం లేదు. విన్నర్ అవ్వాలంటే ప్రతీ వారం నామినేషన్స్ ని ఎదురుకోవాలి. ప్రతీ వారం కాకపోయినా, కనీసం నాలుగైదు వారాలు అయినా నామినేషన్స్ లోకి రావాలి.
కానీ ఇమ్మానుయేల్ సీజన్ మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. గత వారం నామినేషన్స్ లోకి ఈయన కచ్చితంగా రావాల్సి ఉంది. కానీ డిమోన్ పవన్ ట్విస్ట్ కారణంగా ఇతనికి బదులుగా పవన్ కళ్యాణ్ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు ఈ వారం హౌస్ కి కెప్టెన్ అయ్యాడు. ఈ వారం కూడా ఆయన నామినేషన్స్ లో లేనట్టే. ఇదొక కారణం అయితే, ఇమ్మానుయేల్ పూర్తిగా తన స్వార్థం చూసుకొని గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. నిన్న తన ప్రేయసి వాయిస్ నోట్ వినడం కోసం, గౌరవ్ వద్ద ఉన్న బిగ్ బాస్ బ్లెస్సింగ్ పవర్ ని త్యాగం చేయించాడు. ఇది ఇమ్మానుయేల్ కి ఘోరమైన నెగిటివ్ అయ్యింది. సోషల్ మీడియా లో ఆయనపై తీవ్రమైన ట్రోల్స్ పడుతున్నాయి. గౌరవ్ కూడా నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ ని తిడుతూ ఇంత స్వార్థం గా ఆలోచిస్తావని అనుకోలేదంటూ చెప్తాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ సమయం లో ఇమ్మానుయేల్ కి టైటిల్ రేస్ లో నిలచిహేందుకు బంగారం లాంటి అవకాశం దొరికింది. తనూజ ని, ఆమె చేసే డ్రామాని మొత్తం బయటపెట్టి ఆమె నోటి నుండి మాట రానివ్వకుండా చేసాడు. ఇది కదా కావాల్సింది, ఇప్పుడు గేమ్ కరెక్ట్ ట్రాక్ లోకి వెళ్తోంది అని అనుకుంటే, నామినేషన్ జరిగిన రోజే తనూజ ముద్దు మాటలతో ఇమ్మానుయేల్ చెవిలో మందార పూలు పెట్టింది, అంతే అలాగే కరిగిపోయి ఆమెతో ప్యాచప్ చేసుకున్నాడు. ఇక్కడితోనే ఇమ్మానుయేల్ టైటిల్ రేస్ నుండి పది అడుగులు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇక నిన్న ఏదైతే అతను చేసాడో, దాని దెబ్బకు ఇప్పుడు టాప్ 5 లో కూడా స్థానం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. గేమ్స్ కష్టపడి ఆడుతున్నాడు కానీ, తన క్యారక్టర్ తో ప్రతీ వారం దిగజారి పోతున్నాడని, ఈ వారం జరిగే టాస్కుల్లో భరణి, లేదా గౌరవ్ వంటి వారు అద్భుతంగా టాస్కులు ఆడితే ఇమ్మానుయేల్ ని వీరిలో ఎవరో ఒకరు వెనక్కి నెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.