Bigg Boss 9 Telugu Suman Shetty: ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో డిజాస్టర్ ఫ్లాప్ కి తక్కువ, ఫ్లాప్ కి ఎక్కువ అనే విధంగా సాగుతోంది. అందుకు కారణం హౌస్ మేట్స్ మరియు హోస్ట్ నాగార్జున అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. రియాలిటీ షో అంటే ఏంటి?, మనుషుల రియల్ క్యారెక్టర్స్ ని బయటపెట్టి గేమ్ ఆడడమే. కానీ ఈ సీజన్ లో రియాలిటీ నే లేదు, కేవలం డ్రామా మాత్రమే ఉంది. లోపల ఉన్న హౌస్ మేట్స్ కి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. ఇదే మెయిన్ కాన్సెప్ట్. కానీ ఈ సీజన్ లో బయట ఏమి జరుగుతోంది అనేది స్పష్టంగా లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం అయిపోయింది. దీంతో అందరూ డ్రామాలు చేస్తున్నారు, ఎవ్వరూ తగ్గడం లేదు, ఇదే ఈ సీజన్ కి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు.
ఇదంతా పక్కన పెడితే కొంతమంది కంటెస్టెంట్స్ ని మేనేజ్మెంట్ చాలా బలవంతంగా జాకీలు పెట్టి మరీ పైకి లేపుతున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా సుమన్ శెట్టి గురించి మాట్లాడుకోవాలి. ఈయన ఆట తీరుని చూస్తే ఎవరికైనా ఒక్కటే అనిపిస్తాది, హౌస్ లో ఈయన ఆటలో అరటిపండు అని. అలాంటి వ్యక్తి ని నిన్న టాప్ 1 లో ఉన్నట్టు చూపించారు. ఈ వారం మొత్తం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులను విజయవంతంగా పూర్తి అయ్యేలా ప్లాన్స్ వేసింది దివ్య. సుమన్ శెట్టి కేవలం దివ్య చెప్పినట్టు చేసాడంటే. కానీ ప్రశంసలు మొత్తం సుమన్ శెట్టి కి మాత్రమే దక్కాయి. తెలివిగా అలోచించి, ఎవరికీ దొరక్కుండా ఉండేలా ప్లాన్స్ చేసిన దివ్య కి అసలు గుర్తింపు నే లేదు. పైగా ఆయనకు ఆడియన్స్ నుండి నూటికి నూరు శాతం ఓటింగ్ వచ్చినట్టు కూడా చూపించారు. ఇది అతి పెద్ద అబద్ధం అనడం లో ఎలాంటి సందేహం లేదు.
నిన్న బిగ్ బాస్ షోకి వెళ్లిన ఆడియన్స్ అందరికీ ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చారట. సుమన్ శెట్టి గురించి అడిగినప్పుడు కేవలం నాలుగు ఓట్లు మాత్రమే పడ్డాయట. ఆ నాలుగు ఓట్ల కారణంగా వంద శాతం ఓటింగ్ వచ్చినట్టు, నెంబర్ 1 స్థానం లో ఉన్నట్టు చూపించారు. ఇది కచ్చితంగా హౌస్ మేట్స్ ని, ఆడియన్స్ ని ఏమార్చడమే. పైగా సుమన్ శెట్టి కి నాగార్జున హీరో ఆఫ్ ది వీక్ అనే ట్యాగ్ కూడా ఇచ్చాడు. వారం మొత్తం అద్భుతంగా టాస్కులు ఆడి కెప్టెన్ అయినా ఇమ్మానుయేల్ కి ఆ ట్యాగ్ ఇవ్వలేదు, గాయాలపాలైనప్పటికీ టాస్కులు అద్భుతంగా ఆడేందుకు ప్రయత్నం చేసిన భరణి కి కూడా ఆ ట్యాగ్ ఇవ్వలేదు. ఇక ఆట లో ఆరంభం లోనే పీకేసినప్పటికీ, తన తెలివి తో గేమ్ మొత్తం నడిపించిన కళ్యాణ్ కి కూడా ట్యాగ్ ని ఇవ్వలేదు. ఇలా ఇంతమంది కష్టపడి ఆడినా గుర్తించని నాగార్జున, ఎందుకు సుమన్ శెట్టి ని జాకీలు పెట్టి మరీ లేపుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.