Bigg Boss 9 Telugu Elimination Week 7: గత వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ నుండి భరణి ఎలిమినేషన్ ని ఆడియన్స్ తీసుకోలేకపోయారు. ఓటింగ్ ప్రకారం చూస్తే ఆయనకే తక్కువ వచ్చాయి, ఆ తక్కువ ఓటింగ్ నెగిటివిటీ వల్ల రాలేదు. బంధాల్లో చిక్కుకొని గేమ్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు అనే బాధతో ఆయనకు రెగ్యులర్ గా ఓట్లు వేసేవాళ్ళు కూడా ఓటు వెయ్యలేదు. ఫలితంగా ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. పవర్ అస్త్ర తో ఎలిమినేషన్ ని రద్దు చేసే శక్తి ఉన్నప్పటికీ ఇమ్మానుయేల్ దానిని భరణి కోసం ఉపయోగించలేదు. అయ్యో, మొదటి వారం నుండి కలిసి ఉన్న వ్యక్తికి ఇమ్మానుయేల్ వెన్నుపోటు పొడిచాడో అనే బాధ ఆడియన్స్ లో కలిగింది. కానీ ఇమ్మానుయేల్ భరణి కి వెన్నుపోటు పొడవలేదు, ఒక గేమర్ లాగా ఆలోచించి చేసాడు, ఇందులో ఇమ్మూ తప్పేమి లేదని నమ్మేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువే.
అయితే భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. తనూజ తనని తానూ బాగా స్ట్రాంగ్ చేసుకుంది. మరోపక్క ఇమ్మానుయేల్ కూడా తన బాండింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టి తనూజ తో గొడవలు పడడం, ఇలా హౌస్ వాతావరణం మొత్తం మారిపోయింది. ఒక రణరంగాన్ని తలపిస్తుంది. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులను ఒకసారి పరిశీలిస్తే తనూజ, దివ్య, పవన్ కళ్యాణ్, సంజన గల్రానీ, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, రీతూ చౌదరి, రాము రాథోడ్. వీరిలో అందరూ ఊహించినట్టుగానే తనూజ కి కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ నమోదు అవుతుంది. పైగా భరణి ఎలిమినేట్ అయ్యాక ఆయన్ని విపరీతంగా అభిమానించే అభిమానులు కూడా తనూజ కి ఓట్లు వేస్తున్నారు. దానికి తోడు ఈ వారం హౌస్ మేట్స్ అందరూ తనూజ ని టార్గెట్ చేయడం కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది.
ఇక ఆ తర్వాత రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు కానీ, గతం తో పోలిస్తే ఆయన ఓటింగ్ బాగా పడిపోయింది. తనకు అండగా నిల్చిన తనూజ కి వెన్నుపోటు పొడవాలని చూడడం కూడా ఒక కారణం అవ్వొచ్చు. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో దివ్య కొనసాగుతుంది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని పరిణామం. భరణి ఫ్యాన్స్ ఓట్లతో పాటు, ఆమె ఆట తీరు కూడా ఈమధ్య ఆడియన్స్ కి నచ్చుతుండడంతో ఆమె ఓటింగ్ భారీగా పెరిగింది. వీళ్ళ ముగ్గురు తర్వాత సంజన నాల్గవ స్థానం లో కొనసాగుతుంది. మొదటి రెండు, మూడు వారాలు కేవలం ఈమె పేరు మీదనే బిగ్ బాస్ నడిచింది. కానీ ఇప్పుడు ఈమె నుండి ఎలాంటి కంటెంట్ కూడా రావడం లేదు. ఇక ఐదవ స్థానం లో రాము కొనసాగుతుండగా, ఆరవ స్థానం లో రీతూ చౌదరి, 7 వ సాధనం లో సాయి శ్రీనివాస్, 8వ స్థానం లో రమ్య కొనసాగుతుంది. వీరిలో రమ్య ఎలిమినేట్ అయ్యేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే సాయి కూడా ఎలిమినేట్ అవుతాడు.