Bigg Boss 9 Telugu Madhuri: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు, ఒక ట్విస్ట్ నుండి కోలుకునేలోపు మరో ట్విస్ట్, ఇలా ప్రతీ వారం సాగిపోతూ ఉంది. గత రెండు వారాల్లో భరణి, శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ వారం మొత్తం వాళ్ళు హౌస్ లో ఉంటారు. ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో, వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ సంజన, డిమోన్ పవన్, గౌరవ్, తనూజ, పవన్ కళ్యాణ్, దివ్వెల మాధురి, రాము రాథోడ్ మరియు రీతూ చౌదరి. వీరిలో ప్రస్తుత్తం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే అందరికంటే మొదటి స్థానం లో తనూజ ఉంది.
ఈమె ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినా మిగతా కంటెస్టెంట్స్ ఓటింగ్ ర్యాంకింగ్ లో మార్పు ఉండొచ్చేమో కానీ, ఈమె స్థానం మాత్రం సుస్థిరంగా, కదలకుండా అలాగే ఉంది. ఇక ఆ తర్వాత రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్, మూడవ స్థానం లో డిమోన్ పవన్ ఉన్నాడు. వీళ్లిద్దరి మధ్య ఓటింగ్ లో చాలా చిన్న తేడా ఉంది. కచ్చితంగా రాబోయే రోజుల్లో డిమోన్ పవన్ రెండవ స్థానానికి ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఆ తర్వాత నాల్గవ స్థానం లో సంజన ఉండగా, 5వ స్థానం లో రీతూ చౌదరి, ఆరవ స్థానం లో గౌరవ్, 7 వ స్థానం లో రాము రాథోడ్ కొనసాగుతున్నారు. ఇక చివరి స్థానం లో దివ్వెల మాధురి కొనసాగుతుంది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే దివ్వెల మాధురి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవాలి. కానీ అది జరిగే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువే అనిపిస్తున్నాయి.
ఎందుకంటే తనూజ చేతిలో ఎలిమినేషన్ నుండి ఒక కంటెస్టెంట్ ని తప్పించే గోల్డెన్ స్టోన్ ఉంది. మాధురి తనూజ కి బాగా క్లోజ్ కాబట్టి, ఆమె పవర్ ని ఉపయోగించి సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ గౌరవ్ మరియు మాధురి ఎలిమినేషన్ రౌండ్ లోకి వస్తే కచ్చితంగా తనూజ మాధురి కోసమే ఆ పవర్ ని ఉపయోగిస్తుంది. అలా కాకుండా రాము, మాధురి ఎలిమినేషన్ రౌండ్ లో వస్తే మాత్రం తనూజ కచ్చితంగా రాము కోసమే ఆ పవర్ ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. మరో అవకాశం ఏమిటంటే తనూజ నే మాధురి ని డైరెక్ట్ నామినేట్ చేసింది కాబట్టి, కచ్చితంగా తనూజ ఎలిమినేషన్ రౌండ్ లో మాధురి కి ఎదురు గా ఎవరు ఉన్నప్పటికీ, ఆమె అవతల వాళ్ళను సేవ్ చేసేందుకే పవర్ ని ఉపయోగిస్తుందని అంటున్నారు మరికొందరు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.