Bigg Boss 9 Telugu Day 75: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో గత సీజన్ లో ఉన్నంత ఘాటు లేదు. బంధాలు, అనుబంధాలు అంటూ ఒక మంచి టీవీ సీరియల్ లాగా ఈ సీజన్ కొనసాగుతుంది. అందువల్లే ఏమో సీరియల్ ఆడియన్స్ అందరూ ఈ సీజన్ తెగ చూసేస్తున్నారు. ఆ కారణం చేత రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. కానీ 12 వ వారం లోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ హౌస్ లో ప్రేమానురాగాలు మాత్రమే కొనసాగుతున్నాయి, ఎలాంటి గొడవలు లేవు అనుకుంటున్నా సమయం లో కాసేపటి క్రితమే ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో దివ్య మరియు తనూజ మధ్య జరిగిన గొడవ ఈ సీజన్ లోనే ది బెస్ట్ అనుకోవచ్చు. మధ్య లో హౌస్ మేట్స్ లేకపోయుంటే ఒకరిని ఒకరు కొట్టుకునే రేంజ్ కి ఈ గొడవ వెళ్ళేది అనిపిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ హాల్ లో కూర్చోబెట్టి ‘ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నుండి ఎవరిని తప్పించాలని అనుకుంటున్నారో చెప్పండి’ అని అంటాడు. అందుకు దివ్య తనూజ పేరు చెప్తూ ‘రెండు సార్లు ఇమ్మ్యూనిటీ దక్కింది, ఈ వారం కెప్టెన్సీ అయ్యావు. ఇప్పుడు మళ్లీ ఇంకోసారి కెప్టెన్ అయితే ఏకంగా 13వ వారం లోకి వెళ్ళిపోతావు. అందుకే నేను నిన్ను గేమ్ నుండి తప్పిస్తున్నాను’ అని అంటుంది . గేమ్ పరంగా ఆలోచిస్తే దివ్య చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్. కానీ దివ్య నిన్న రాత్రి పెట్టుకున్న గొడవ కారణంగా ఇదంతా ఆమె తనూజ మీద అసూయ తో కావాలని కక్ష్య గట్టి ఆమె ఇదంతా చేస్తుందని ఆడియన్స్ కి అర్థం అవుతోంది. ఎందుకంటే రెండు వరాల క్రితం కూడా ట్రైన్ టాస్క్ లో తనూజ ని ఇలాగే గేమ్ నుండి తప్పించింది.
ఇక నిన్న భరణి తనూజ కాళ్లకు ఆయింట్మెంట్ రాయడం, అది చూసి తట్టుకోలేకపోయిన దివ్య తనూజ పై కోపం పెంచుకొని గొడవపడినట్టు అయ్యింది. అంతే కాకుండా భరణి కూతురు తనూజ ని ఇష్టపడడం, మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంది అంటూ కామెంట్ చేయడం, ఆ సమయం లో దివ్య ముఖం మాడిపోవడం, ఇవన్నీ చూస్తే దివ్య కావాలని తనూజ ని గేమ్ నుండి తప్పించినట్టు అందరికీ అనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న దివ్య కి అందరికంటే తక్కువ ఓటింగ్ ఉంది, ఇప్పుడు తనూజ ని టార్గెట్ చేయడం వల్ల ఆమె ఓటింగ్ పై మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నందున, ఈ వారం ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.
