Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో టైటిల్ కొట్టడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో ఇమ్మానుయేల్ పేరు కచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇతను టాస్కులు వచ్చినప్పుడు ప్రాణం పెట్టి ఆడాడు, మూడు సార్లు ఇంటికి కెప్టెన్ అయ్యాడు, అంతే కాకుండా ఎంటర్టైన్మెంట్ అందించడం లో ఇమ్మానుయేల్ ని మించిన వాళ్ళు బిగ్ బాస్ 9 లో ఎవ్వరూ లేరు. వీటితో పాటు స్మార్ట్ గా అలోచించి గేమ్ లో అడుగులు వేయడం, నామినేషన్స్ సమయం లో గన్ షాట్ లాంటి పాయింట్స్ పెట్టడం వంటివి చూస్తే ఇమ్మానుయేల్ తోపు, దమ్ముంటే ఆపు అని అనకుండా ఎవ్వరూ ఉండలేరు. అందుకే ఇన్ని వారాలు ఆయన నామినేషన్స్ లోకి రాకుండా, 11 వ వారం నామినేషన్స్ లోకి వచ్చినా కూడా జనాలు ఆయనకు ఓట్ల వర్షం కురిపించారు.
ఇన్ని వారాలు హౌస్ నామినేషన్స్ లోకి రాకపోతే ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అవుతాడు. కానీ ఇమ్మానుయేల్ కి పవన్ కళ్యాణ్ తో సమానంగా ఈ వారం ఓటింగ్ పడింది. ముఖ్యంగా మిస్సెడ్ కాల్స్ అయితే అత్యధికంగా ఇమ్మానుయేల్ కి వచ్చాయని అంటున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. కానీ ఇమ్మానుయేల్ లో ఉన్న ఒకే ఒక్క చెడ్డ లక్షణం , సేఫ్ గేమ్. ప్రతీ సందర్భం లోనూ ఆయన సేఫ్ గేమ్ ఆడేందుకే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. బాండింగ్స్ కూడా ఇమ్మానుయేల్ వి అంత నిజాయితీగా అనిపించేవి కాదు, కానీ సంజన తో తల్లి బాండింగ్ మాత్రం ఆయన నిజంగానే మైంటైన్ చేస్తున్నాడని జనాలు గట్టిగా నమ్మారు. కానీ నిన్నటి ఎపిసోడ్ తో ఆడియన్స్ లో ఆ అభిప్రాయం మొత్తం పోయింది.
సంజన ఇన్ని రోజులు ఇమ్మానుయేల్ తో తల్లి బాండింగ్ లో ఉన్నప్పటికీ, ఎప్పుడూ కూడా ఇమ్మానుయేల్ ని సహాయం కోరలేదు. కానీ నిన్న మాత్రం ఆమె కెప్టెన్సీ టాస్క్ లో సహాయం కోరింది. అందుకు ఇమ్మానుయేల్ గోడ మీద పిల్లి లాగా నీతో పాటు దివ్య కి కూడా సపోర్ట్ చేయాలనీ ఉందని అంటాడు. నోరు తెరిచి ఒక్కసారి నాకు సపోర్టు చేయమని ఇమ్మానుయేల్ ని సంజన కోరితే, అందుకు ఆయన ఒక స్టాండ్ తీసుకోలేదు. దీనికి ఇమ్మానుయేల్ ఇన్ని రోజులు తల్లి బాండింగ్ ని గేమ్ కోసం ఉపయోగించుకున్నాడా?, బొమ్మల టాస్క్ లో కూడా ఇమ్మానుయేల్ సంజన బొమ్మ ని ముట్టుకోకుండా చాలా సేఫ్ గా గేమ్ ఆడాడు. ఇదంతా చూస్తుంటే ఆమెతో పెట్టుకున్న రిలేషన్ ఫేక్ అనే అనిపిస్తోంది. అదే సమయం లో ఆమె కోసం ఫ్యామిలీ వీక్ లో టైం ని దానం చేయడం, అంతే కాకుండా గతంలో ఆమె కోసం కష్టపడి ఆడి గెలుచుకున్న కెప్టెన్సీ ని వదులుకోవడం వంటివి చూస్తే వీళ్ళ రిలేషన్ నిజమే అని అనిపిస్తోంది. కచ్చితంగా రిలేషన్ నిజమే, కానీ ఇది గేమ్ కాబట్టి పరిస్థితుల కారణం గా ఒక్కోసారి ఇలా అవుతుంటాయి అనేది వాస్తవం.