Bigg Boss 9 Telugu Day 83: గత మూడు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్స్ నుండి అక్కినేని నాగార్జున హోస్టింగ్ ఆయన అభిమానులకు కూడా చిరాకు కలిగించేలా చేస్తోంది. ప్రేక్షకులు ఏమైనా అనుకుంటారేమో, కాస్త న్యాయం గా వ్యవహరించాలి అనే స్పృహ కూడా ఆయనకు లేదు. ఒక బాలింత ని ఎన్ని విధాలుగా వేదించాలో, షో టీఆర్ఫీ కోసం అన్ని విధాలుగా వేధిస్తున్నారు. ఆమె ఎమోషన్స్ తో, బాధతో అసలు సంబంధమే లేదు. మరీ ఇంత కఠినంగా బిగ్ బాస్ టీం ఎలా మారిపోయిందో అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ టీం సంజన గల్రాని ని టార్గెట్ చేయడం, టీఆర్ఫీ రేటింగ్స్ కోసం బిగ్ బాస్ డోర్లు తెరిచి, క్షమాపణలు చెప్పకపోతే వెళ్ళిపో అని అనడం, సరే నేను వెళ్ళిపోతాను అంటే, దాదాపుగా ఆమె కాళ్ళు పట్టుకొని మరీ హౌస్ లో ఉంచేందుకు ప్రయత్నం చేయడం, బిగ్ బాస్ షో పరువు తీసినట్టు అయ్యింది.
విషయం లోకి వెళ్తే ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో రీతూ చౌదరి, డిమోన్ రిలేషన్ పై సంజన గల్రాని చేసిన కామెంట్స్ పెను దుమారమే రేపాయి. ఆమె మాట్లాడుతూ నువ్వు, డిమోన్ రాత్రి అయితే ఒకరిని ఒకరు అంటుకొని కూర్చోవడం నాకు అసలు నచ్చడం లేదు, చూసేందుకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఆమె చూసిందే చెప్పింది, ఎలాంటి కల్పితాలు లేవు, కానీ ఆమెకు అసౌకర్యంగా అనిపించిన సమయం లోనే చెప్పేసి ఉండుంటే కచ్చితంగా తప్పు కాదు, కానీ నామినేషన్స్ సమయం లో ఆ పాయింట్ ని పట్టుకొని ఒక రిలేషన్ ని నిందించడం ముమ్మాటికీ తప్పే. అందుకు ఆమె కావాల్సినంత నెగిటివిటీ ని ఎదురుకుంది, అందుకు ఆమె అర్హురాలు కూడా. అందుకు ఆమె చేత క్షమాపణలు చెప్పించి ఉంటే సరిపోయేది.
కానీ అలా చేయకుండా, ఇంతకు ముందు భరణి, రీతూ, తనూజ, ఇమ్మానుయేల్ చేత త్యాగాలు చేయించి, ఎలిమినేట్ అవ్వాల్సిన సంజన ని లోపలకు తీసుకొచ్చినట్టు ఒక డ్రామా క్రియేట్ చేశారు. వాస్తవానికి ఆమె 3 వ వారం ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వలేదు. హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యింది, స్టేజి మీదకు వచ్చినప్పుడు మళ్లీ త్యాగాల పేరుతో డ్రామా చేసి తీసుకొచ్చారు. ఆ భారాన్ని ఆమె మోయలేక, తన గేమ్ తానూ ఆదుకోలేక నరకం చూసింది. ఇప్పుడు కూడా ఆ నలుగురు ఒప్పుకుంటేనే హౌస్ లో ఉంటావు అనేలోపు, సంజన ఎదురు తిరిగింది. నాకు వాళ్ళ దయతో హౌస్ లో ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను వెళ్లనివ్వండి అంటూ గట్టిగా నిలబడింది. నాగార్జున చాలా వరకు ఆమెని ఒప్పించే ప్రయత్నం చేసాడు, కానీ ఆమె ఒప్పుకోలేదు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి బాబోయ్ అంటూ తన ఆత్మగౌరవం కోసం పోరాడింది. చివరికి ఏమి చెప్పి ఆమెని ఒప్పించారో ఏమో తెలియదు కానీ, హౌస్ లో ఉండేందుకు ఒప్పుకుంది. డిమోన్ పవన్ కి చేసినట్టు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, ఆడియన్స్ కి క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేశారు నాగార్జున మరియు బిగ్ బాస్ టీం, వాళ్ళ ప్రయత్నాలను బూడిదలో పోసిన పన్నీరు అయ్యేలా చేసింది సంజన. నిన్నటి ఎపిసోడ్ తో ఆమె గ్రాఫ్ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఈ దెబ్బతో ఆమె టాప్ 5 లో స్థానం సంపాదించుకున్నట్టే అనుకోవచ్చు.