Bigg Boss 9 Telugu Dammu Sreeja Vs Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో గొడవలు ఇంతకు ముందు సీజన్స్ తో పోలిస్తే ఎక్కువ జరుగుతాయి అని అందరూ ఊహించారు కానీ, ఇంత తొందరగా రెండవ రోజే పెద్ద గొడవలు జరుగుతాయి అని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ముఖ్యంగా సంజన గల్రాని చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్లే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. మాస్క్ మ్యాన్ వల్ల హౌస్ పెద్ద పెద్ద సమస్యలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ, బోలెడంత కంటెంట్ ఇచ్చేస్తుంది సంజన. హౌస్ లో ఇలా గొడవలు పెట్టుకునే వాళ్ళే ఉండాలి. లేకపోతే కిక్ ఉండదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ వీకెండ్ లో సంజన నే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె ప్రవర్తన ఆ రేంజ్ లో ఉంది మరీ. కన్నడ బిగ్ బాస్ లో కూడా ఈమె కేవలం రెండు వారాలు మాత్రమే కొనసాగింది.
Also Read: రాజమౌళి సినిమాల్లో ఆ రెండు సినిమాలు బాగా ఆడలేదని చెప్పిన రమా రాజమౌళి…
దీనిని బట్టీ ఈమె ప్రవర్తన ని అక్కడి కంటెస్టెంట్స్, జనాలు కూడా భరించలేకపోయారు అనుకోవాలి. ముఖ్యంగా ఈమె దమ్ము శ్రీజా తో పెట్టుకున్న గొడవ, ఈమె క్యారక్టర్ ని బయట పెట్టేసింది. మీరు కెమెరా ఫుటేజీ కోసమే మొత్తం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది శ్రీజ. అప్పుడు ఎవరికీ ఫుటేజీ కావాలి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఫుటేజీ మీలాంటోళ్లకు అవసరం, నాకు కాదు అంటుంది. అప్పుడు దమ్ము శ్రీజా మీరు నామినేషన్స్ లో ఉన్నారు కదా, అందుకే ఫుటేజీ కోసం, కంటెంట్ కోసమే గొడవలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది, నేను మీకు ఆ అవకాశం ఇవ్వను, మీతో వాదించను అని హౌస్ లోపలకు వెళ్తుంది. ఫ్లోరా షైనీ తో జరిగిన బాత్రూం గొడవ లో కూడా దమ్ము శ్రీజా ఫుటేజీ కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు కూడా శ్రీజ కి ఆమె చాలా బలుపు యాటిట్యూడ్ తో సమాధానం చెప్తుంది.
అనంతరం ఆమె హాల్ లో కూర్చొని ఇమ్మానుయేల్ తో చర్చలు మాట్లాడుతూ ఉంటుంది. శ్రీజ గురించి మాట్లాడుతూ ‘ఈమె పెద్ద సైకో..పెద్ద పెద్దగా గొంతు వేసుకొని మాట్లాడుతుంది. నేను ఫుటేజీ కోసం చేస్తున్నాను అంట. నాకు అంత అవసరం ఏముంది?, నేను ఏమైనా చిన్న మనిషి అనుకుంటుందా?’ అని ఇమ్మానుయేల్ తో అంటుంది. ఇమ్మానుయేల్ కి ఈమెతో మంచి బాండింగ్ ఉండడం తో ఆయన గట్టిగా అలా సైకో లాంటి పదాలు ఉపయోగించకూడదు అని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన మౌనం గా ఆమె చెప్పేది వింటూ కూర్చున్నాడు. ఇమ్మానుయేల్ కి శ్రీజా తో మంచి రిలేషన్ ఉంది. ఇక్కడ ఆమె కోసం ఒక స్టాండ్ బలంగా తీసుకొని మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఒకసారి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోండి, ఆ అమ్మాయి అలాంటిది కాదు అని ఒక మాట అన్నాడు కానీ, సైకో అనేది చిన్న పదం కాదు కదా, ఇంకా గట్టిగా ఆమె కోసం నిలబడి ఉండుంటే బాగుండేది అని చూసే ఆడియన్స్ కి అనిపించింది.