Bigg Boss 9 Telugu Wild Card Entry : ‘బిగ్ బాస్ సీజన్ 9′ షో స్టార్ట్ అయి నెల రోజులు గడిచినప్పటికి ఈ షో ప్రేక్షకుల్లో పెద్దగా ప్రాముఖ్యతనైతే సంపాదించుకోలేకపోతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కి టీఆర్పీ రేటింగ్ కూడా చాలావరకు తగ్గిపోయింది. ఇక షో యాజమాన్యం తొందరగా యాక్టివేట్ అయి ఇలానే ఉంటే ఈ సీజన్ ప్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. ఇక ఈరోజు ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు ఇక మీదట షో ను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారా? వాళ్ల ద్వారా అయినా ఈ షోకి భారీ టిఆర్పి రేటింగ్ వస్తుందా? లేదా అనే ధోరణిలో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి… ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లలో ఎవరు ఎలాంటి ప్రాముఖ్యతను చూపించి హౌజ్ లో సర్వైవల్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది… ఈ వారం ఆయేషా, దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, శ్రీనివాస్ సాయి, నిఖిల్, గౌరవ్ ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చారు. ఇక వీళ్లలో మాధురి, రమ్యలను తీసుకోవడం పట్ల ప్రేక్షకుల నుంచి కొంతవరకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అయితే వస్తోంది…
ఎందుకంటే వాళ్లు డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు. కాబట్టి వాళ్లు హౌజ్ లో ఎలాంటి రచ్చ చేయబోతున్నారు అనేది తలుసుకుంటే ప్రతి ఒక్కరికి భయం కలుగుతోంది. మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే శ్రీజ కి తన పేరు తెలియదని చెప్పడంతో ఆమెతో గొడవ పెట్టుకునేంత పనైతే చేసింది…
మొదటి రోజు ఇలా ఉంటే ముందు ముందు ఆమె ఎవరెవరి మీద ఫైర్ అవుతోంది, ఎవరిని అనవసరంగా దూషిస్తోందో, ఎవరితో పోట్లాటలు పెట్టుకుంటుందో అనే విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి… గేమ్ ని గేమ్ లా ఆడితే పర్లేదు కానీ ఆమె పర్సనల్గా తీసుకొని హౌస్ మేట్స్ మీద చాలావరకు తన కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం అయితే చేస్తుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య సైతం చూడటానికి క్యూట్ గా కనిపించినప్పటికి తను చాలా వైలెంట్ అనే విషయం ఇంతకుముందు చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసింది. మరి తను కూడా బిగ్ బాస్ హౌజ్ లో సంచలనాన్ని సృష్టించబోతుందనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది…’ఇల్లు పీకి పందిరేసినట్టు’ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని టార్గెట్ చేసి తను గేమ్ ఆడబోతుందనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. మిగతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల గురించి పక్కన పెడితే మాధురి, రమ్య లను తీసుకోవడం పట్ల చాలామంది బిగ్ బాస్ షో మీద విమర్శలు చేస్తున్నారు. ఇక వీళ్ళు షోకి ప్లస్ అవుతారా? లేదా మైనస్ గా మారతారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…