Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో జరుగుతున్న సంఘటనలు ఆడియన్స్ కి అసలు ఏమాత్రం నచ్చడం లేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు టెనెంట్స్ కి ఆహరం లేకుండా చేసాడు బిగ్ బాస్. ఆరోజు టెనెంట్స్ అందరూ పిచ్చి ఆకలి తో ఉన్నారు. ఇక సంజన అయితే 5 ఏళ్ళ బిడ్డకు జన్మనిచ్చిన బాలింత. ఆమె అసలు ఈ షో కి రావడమే ఒక పెద్ద సాహసం, అలాంటిది ఆమె ఆకలి తో ఎంతసేపని ఉండగలదు చెప్పండి?. అందుకే ఆకలి ని తట్టుకోలేక గుడ్డు ని దొంగతనం చేసి తినింది. దీనిని తనూజ మరియు భరణి చూసారు. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి అని సంజన వాళ్ళిద్దరితో చెప్పింది, జాలి పడి వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ సంజన వాళ్ళిద్దరికీ నేను తిన్నట్టు తెలుసు అంటూ నోరు జారీ చాలా పెద్ద తప్పు చేసింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు భరణి, తనూజ లను ఈ అగ్నిపరీక్ష సామాన్యులు టార్చర్ చేస్తూనే ఉన్నారు.
ఈరోజు భరణి మీద నామినేషన్స్ పాయింట్స్ ఓనర్స్ అని పిలువబడుతున్న ఆ సామాన్యులే గుడ్డు సంఘటన ని ఆధారంగా చేసుకొని టార్గెట్ చేసి మరీ నామినేషన్ వేశారు. మనీష్ అనే వ్యక్తి అయితే అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భరణి మీద ఇంత పగ,కసి ఎందుకో అసలు అర్థం కాలేదు. హౌస్ లోకి అందరూ అడుగుపెట్టి ఒక్క వారం రోజులు మాత్రమే పూర్తి అయ్యింది. ఇంతలోపే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలిసిపోతుందా?, ఈ ఆరు మంది సామాన్యులు ఈరోజు జనాలకు ఏమని చెప్పే ప్రయత్నం చేసారంటే, భరణి అనే వ్యక్తి మంచోడు కాదు,మంచోడి ముసుగు వేసుకున్న కన్నింగ్ స్నేక్ అని. ఇక్కడ నేరుగా ఆయన క్యారక్టర్ ని తక్కువ చేసి చూపించారు.
మాస్క్ మ్యాన్ హరీష్ భరణి, ఇమ్మానుయేల్ ని ఆడవాళ్ళతో పోల్చి చూసినప్పుడు, చూసే ప్రతీ ప్రేక్షకుడికి ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడినట్టుగానే అనిపించింది. అదే సంజన కూడా మొన్న శనివారం ఎపిసోడ్ లో చెప్పింది. నువ్వు మాట్లాడే మాటలు చూసి జనాలు అలా నిర్ణయించుకున్నారు,ఆమె ప్రత్యేకంగా నీకు ఎలాంటి ముద్ర వేయలేదు. దానికే మాస్క్ మ్యాన్ హరీష్ సంజన నా క్యారక్టర్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఈ ఆరు మంది సామాన్యులు భరణి అసలు మంచి వాడే కాదు, పాము లాంటోడు అని ముద్ర వేయడానికి చూసారు. దీనికి భరణి ఎంత హంగామా చేయొచ్చు?, కానీ ఆయన అలా ఏమి చేయలేదు. ఒక బాలింత ఆకలితో గుడ్డు తీసుకొని తింటే, దానిని ఇంత సమస్య చేస్తారని బహుశా భరణి ఊహించి ఉండకపోయుండొచ్చు, లేదంటే ఆరోజే చెప్పేవాడేమో అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.