Bigg Boss 9 Telugu Bharani: మొదటి వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ నుండి శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రెండవ వారానికి సంబందించిన నామినేషన్స్ ప్రక్రియ నిన్న వాడావేడి వాతావరణం లో జరిగిన సంగతి మనమంతా చూసాము. టీవీ లో మనం చూసింది కొద్దిగా మాత్రమే, కానీ జియో హాట్ స్టార్ లైవ్ లో మాత్రం పూర్తి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ లో రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, భరణి శంకర్, డిమోన్ పవన్, ఫ్లోరా షైనీ. వీరిలో మొన్నటి వరకు అయితే ఫ్లోరా షైనీ ఇంకోసారి నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఈ వారం టాప్ ఓటింగ్ తో భరణి శంకర్ నెంబర్ 1 స్థానం లో దూసుకొని పోతుంటే, ఫ్లోరా షైనీ టాప్ 2 స్థానం లో కొనసాగుతుంది.
ఇదే ఈ వారం మనం చూస్తున్న అతి పెద్ద ట్విస్ట్. ఇక ఆ తర్వాతి స్థానం లో డిమోన్ పవన్ కొనసాగుతున్నాడు. అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సామాన్యులలో కేవలం డిమోన్ పవన్ ఒక్కడే అందరికీ మంచిగా అనిపిస్తున్నాడు. ఒక్క సరైన టాస్క్ పడితే డిమోన్ పవన్ గ్రాఫ్ రాబోయే రోజుల్లో పూర్తి గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురి తర్వాత ప్రియా మరియు మాస్క్ మ్యాన్ హరీష్ కి దాదాపుగా సమానమైన ఓటింగ్ పడుతుంది. వీళ్లిద్దరికీ చాలా దూరం లో ఉన్నాడు మాస్క్ మ్యాన్ మనీష్. ఇతను ప్రియా, శ్రీజ లతో పోలిస్తే చాలా బెటర్. కానీ ఎందుకో ఆడియన్స్ ఇతనికి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. బహుశా హౌస్ లో ఏ ఒక్కరి తోనూ ఇతను సరైన రిలేషన్ ని మైంటైన్ చేయలేదు.
చేసుంటే వాళ్ళు నామినేషన్స్ లేని సమయం లో వాళ్ళ ఓటింగ్ మాస్క్ మ్యాన్ కి కలిసొచ్చి ఉండేది. ఇప్పుడు డిమోన్ పవన్ ఉన్నాడు, ఇతను ఇమ్మానుయేల్ మరియు తనూజ లతో చాలా స్నేహం గా ఉంటున్నాడు, కాబట్టి వాళ్ళ అభిమానుల ఓటింగ్ ఈయనకు కలిసి వస్తుంది. అలా మర్యాద మనీష్ కి కలిసి రావడం లేదు. ఇదే అతి పెద్ద సమస్య. కాబట్టి ఈ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అతనికి అనుకూలంగా ఏదైనా పాజిటివ్ ఎపిసోడ్ పడితే సేఫ్ అవ్వొచ్చు.