Bigg Boss 9 Telugu 69 Episode: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో మంచి TRP రేటింగ్స్ తోనే కొనసాగుతోంది. వీకెండ్ ఎపిసోడ్స్ కి 7 నుండి 8 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుండగా, మిగిలిన రోజుల్లో 5 నుండి 6 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. సీజన్ 7 తర్వాత అంతటి రేటింగ్స్ దీనికే వస్తుంది. గత సీజన్ లో రేటింగ్స్ పెద్దగా రాకపోవడం తో బిగ్ బాస్ షో టైమింగ్స్ కూడా మార్చేశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి రాలేదు. ఈ సీజన్ మొత్తం ఒక టీవీ సీరియల్ లాగా ఉండడం తో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే చూస్తున్నారు. అయితే ఈ రేటింగ్స్ ని మరింత పెంచాలని, ఫ్యామిలీ వీక్ లో రేటింగ్స్ బ్లాస్ట్ అయిపోవాలని బిగ్ బాస్ టీం పరమ చెత్త ప్లాన్ వేసింది. అదేమిటంటే సంజన కి ఫ్యామిలీ వీక్ లేదట. నిన్నటి ఎపిసోడ్ లో ఈ బిగ్ బాంబుని పేల్చాడు నాగార్జున.
దీంతో సంజన ఎంతలా ఏడ్చిందో మనమంతా చూసాము. రెండు నెలల బిడ్డని వదిలి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బాలింత ఆమె. బాలింత గా ఉన్నప్పుడు శరీరం మొత్తం ఎంత తికమకగా ఉంటుంది బిడ్డకు జన్మనిచ్చే ప్రతీ తల్లికి తెలుసు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఊరికే కోపం వచ్చేస్తుంది, విపరీతమైన ఆకలి ఉంటుంది, ఇలా ఒక్కటా రెండా ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి ఆమె తనకు కెరీర్ లో బంగారం లాంటి ఛాన్స్ వదులుకోదల్చుకోలేదు, అందుకే బిగ్ బాస్ కి వచ్చింది. ఏనాడు కూడా ఆమె తనలోని బాధని బయటకు వ్యక్తపరిచి సానుభూతి డ్రామాలు ఆడలేదు. చాలా నిజాయితీగా గేమ్ ఆడింది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో చిలిపి పనులు చేసింది, ఈ షో కి మంచి టీఆర్ఫీ కంటెంట్ కూడా ఇచ్చింది. అలాంటి మనిషిని మరింతగా ఇలా బాధపెట్టడం సరికాదు.
సంజన ఫ్యామిలీ హౌస్ లోకి రావడం లేదు అంటూ నాగార్జున చెప్పిన మాట పచ్చి అబద్దం. గత సీజన్ లో కూడా టేస్టీ తేజ కి ఇలాంటి జిమ్మిక్ చేశారు. కానీ చివరి రోజున అతని ఫ్యామిలీ ని లోపలకు పంపించి సప్రైజ్ కి గురి చేసింది బిగ్ బాస్ టీం. ఇదంతా చేసింది టీఆర్ఫీ రేటింగ్స్ కోసం మాత్రమే. ఇప్పుడు సంజన కూడా అదే ప్లాన్ వేస్తున్నారు. ఊహించిన సంఘటన నే అని సంజన కుటుంబాన్ని హౌస్ లోకి రాకుండా చూస్తారా?, లేదా రాణిస్తారా అనేది తెలియాల్సి ఉంది.