Bigg Boss 9 : తెలుగు ఆడియన్స్ అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్(Bigg Boss Telugu). ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే 8 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఈ ఏడాది 9 వ సీజన్ ని ప్రారంభించుకోనుంది. మేకర్స్ ఆగష్టు నెలాఖరున కానీ, లేకపోతే సెప్టెంబర్ మొదటి వారం లో కానీ ఈ రియాలిటీ షో ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లను ఖరారు చేశారు. త్వరలోనే వీళ్లకు ఇంటర్వ్యూస్ జరగనున్నాయి. అయితే ఈ సీజన్ కి నాగార్జున(Akkineni Nagarjuna) హోస్ట్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాడని, ఆయన స్థానం లోకి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వస్తున్నాడని సోషల్ మీడియా లో ఒక ప్రకారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!
ఇది నిజమని కొందరు, కాదు అబద్ధం అని మరికొందరు మాట్లాడుతున్నారు. అసలు నిజానిజాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. అక్కినేని నాగార్జున తో హోస్టింగ్ ఒప్పందం సాధారణంగా సీజన్ 7 తోనే ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున స్థానం లోకి బాలయ్య ని తీసుకొచ్చే ప్రయత్నం చాలానే చేశారు. కానీ బాలయ్య ససేమీరా నో చెప్పాడట. ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్’ షోలో బాలయ్య హోస్టింగ్ ని చూసి ఎట్టిపరిస్థితిలో ఆయన్నే పెట్టుకోవాలని సీజన్ 8 కి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేసింది అనేది వాస్తవమే. కానీ బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోని నేను కేవలం అల్లు అరవింద్ గారి మీద అభిమానం తో మాత్రమే చేసానని, ఆ ఒక్క షో కి తప్ప మరో షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే సమస్యే లేదని ముఖం మీదనే చెప్పేశాడట.
దీంతో మళ్ళీ బిగ్ బాస్ యాజమాన్యం అక్కినేని నాగార్జున సీజన్ 8 నుండి 12 వ సీజన్ వరకు హోస్ట్ గా కొనసాగేలా ఒప్పందం చేసుకున్నారట. కాబట్టి ఈ సీజన్ కి హోస్ట్ మారబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు స్పష్టంగా అందరికీ అర్థం అయ్యింది. అయితే నాగార్జున హోస్ట్ గా కొనసాగడం పై బిగ్ బాస్ లవర్స్ అసంతృప్తి తో ఉన్నారు. ఎందుకంటే బంపర్ హిట్ అవ్వాల్సిన 8వ సీజన్ కేవలం యావరేజ్ రేంజ్ కి పరిమితం కావడానికి ప్రధాన కారణం అక్కినేని నాగార్జున హోస్టింగ్ మాత్రమే అని, ఈ సీజన్ లో ఆయన పాయింట్ చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని, నార్మల్ ఎపిసోడ్స్ కి వీకెండ్ ఎపిసోడ్స్ కి అసలు తేడా కనిపించడం లేదని ఇలా ఎన్నో రకాల విమర్శలను ఎదురుకున్నాడు నాగార్జున. గత సీజన్ తప్పులు తెలుగు తెలుసుకొని, వాటిని ఈ సీజన్ లో సరిదిద్దుకుంటాడో లేదో చూద్దాం.