Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటివారం పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 1న గ్రాండ్ గా లాంచ్ చేశారు. సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. రెండో వారానికి గాను 8 మంది నామినేట్ అయ్యారు. పృథ్విరాజ్, నాగ్ మణికంఠ, శేఖర్ బాషా, విష్ణుప్రియ, నైనిక, సీత, ఆదిత్య ఓం, నిఖిల్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు నెక్స్ట్ వీక్ ఇంటిని వీడనున్నారు. దాదాపు టాప్ సెలెబ్స్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇంటిని వీడేది ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది.
కాగా ఓ కంటెస్టెంట్ వరస్ట్ అని తేల్చేశారు ఆడియన్స్. రెండు వారాలు కూడా ముగియకుండానే ఆమె నిజస్వరూపం బయటపడిందని అంటున్నారు. హౌస్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన, మాట తీరును ఆడియన్స్ నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఆచితూచి మాట్లాడాలి. ఎమోషన్స్ పై కంట్రోల్ ఉండాలి. గతంలో పలువురు కంటెస్టెంట్స్ అనుచిత ప్రవర్తన కారణంగా నెగిటివిటీతో హౌస్ నుండి బయటకు వచ్చారు.
సీజన్ కి గాను సోషల్ మీడియాలో సోనియా ఆకుల అత్యంత నెగిటివిటీ ఫేస్ చేస్తుంది. ఇతర కంటెస్టెంట్స్ ని జడ్జి చేస్తూ ఆమె చేసే కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ డే నాడు విష్ణుప్రియ పై సోనియా ఆకుల చేసిన వ్యక్తిగత ఆరోపణలు సంచలనం రేపాయి. కేవలం హౌస్లో ప్రవర్తన, గేమ్ ఆధారంగా ఒకరిని నామినేట్ చేయాలి. సోనియా అంతకు మించి ఎక్కువ మాట్లాడింది.
బిగ్ బాస్ హౌస్లో ఎలా ప్రవర్తించినా చూసి ఇబ్బంది పడేందుకు నీకు పేరెంట్స్ లేరని విష్ణుప్రియను సోనియా అన్నారు. అలాగే విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్ ని తప్పుబట్టింది. అడల్ట్ జోక్స్ వేస్తున్నావు. ఎలా బట్టలు ధరించాలో తెలియదు, అంటూ విష్ణుప్రియపై అటాక్ చేసింది. సోనియా ఆకుల గేమ్ గమనిస్తున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే దారుణంగా తిడుతున్నారు. సోనియా ఆకులను ఎలిమినేట్ చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
గత సీజన్స్ లో కంటెస్టెంట్ చేసిన శ్రీసత్య, శోభా శెట్టి, రతిక రోజ్.. అత్యంత నెగిటివిటీతో హౌస్ నుండి బయటకు వచ్చారు. తనను ఎంతగా జనాలు తిట్టుకున్నారో శోభా శెట్టికి బయటకు వచ్చాక తెలిసింది. దాంతో ఆమె క్షమాపణలు చెప్పింది. తాను ఏం చేసినా అది గేమ్ లో భాగమే. తప్పుగా అనిపిస్తే క్షమించండి అని ఆమె వీడియో విడుదల చేశారు. ఇకపై సోనియా ఆకుల గేమ్ ఎలా సాగుతుందో చూడాలి.