Jeethu Joseph: ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి దర్శకుడి చూపు తెలుగు సినిమా హీరోల మీదనే ఉంది. ఎందుకంటే మన హీరోలతో సినిమాలు చేస్తేనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెసులు గా నిలుస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. ఒక సినిమాను భారీ బ్లాక్ బాస్టర్ గా తీసుకెళ్లి భారీ కలెక్షన్లను రాబట్టడంలో తెలుగు హీరోలను మించిన వాళ్లు ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ దర్శకులు సైతం తెలుగు సినిమా హీరోల వెంట పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మళయాళం ఇండస్ట్రీకి చెందిన జీతు జోసఫ్ లాంటి డైరెక్టర్ సైతం మన తెలుగు హీరోలతో సినిమా చేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈయన మలయాళ ఇండస్ట్రీలో తన సినిమాలతో చాలావరకు అద్భుతాలను సృష్టించారు. ఈయన చేసిన దృశ్యం సిరీస్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రతి ఒక్కరి మనసులను దోచుకుందనే చెప్పాలి. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఈ సినిమాలు మొదటి స్థానంలో నిలుస్తాయి. ఇక ఈ సినిమాలని ఆయన మళయాళం లో మోహన్ లాల్ ని హీరోగా పెట్టి చేశాడు.
ఇక తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి భారీ సక్సెస్ లను అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి దర్శకుడు ఇప్పుడు తెలుగులో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంటే మరొక మంచి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు అందరూ హీరోలు వరుసగా రెండు మూడు సినిమాలకి కమిటై ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పిన పాయింట్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ మన హీరోలు డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. మరి ఈయన మన హీరోలతో సినిమాలు చేయాలంటే చాలా సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
మరి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక ఆయనకు ఉందా? లేదంటే మలయాళం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలతో సినిమా చేసే ప్రయత్నం చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి ‘జీతూ జోసఫ్ ‘ లాంటి దర్శకుడితో మన హీరోలు సినిమాలు చేస్తే మన హీరోల క్రెడిబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కానీ మన వాళ్లు ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తారా లేదా అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఆయన ముందుగా ప్రభాస్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ప్రభాస్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని కనక తెరకెక్కిస్తే ఆయనకి కొత్తగా ఉండడమే కాకుండా చూసే ప్రేక్షకులు కూడా ప్రభాస్ ని చాలా కొత్త క్యారెక్టర్ లో చూస్తారు. కాబట్టి తప్పకుండా ఆ క్యారెక్టర్ అనేది ప్రభాస్ కి చాలా యాప్ట్ అవుతుందని తను భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు చాలా బిజీగా ఉన్నాడు. చూడాలి మరి మన హీరోలు జీతు జోసఫ్ కి అవకాశం ఇస్తారా లేదా అనేది…