Bigg Boss 8 Telugu: కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. ఈసారి టాప్ సెలెబ్రిటీలు ఎవరూ కంటెస్ట్ చేయలేదు. ఒకరిద్దరు మినహాయిస్తే అందరు బుల్లితెర, సోషల్ మీడియా సెలెబ్స్ అని చెప్పొచ్చు. ఇక మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఈమె సోషల్ మీడియా స్టార్ కేటగిరీలో అవకాశం దక్కించుకుంది. బెజవాడ బేబక్క హౌస్లో సత్తా చాటుతుంది అనుకుంటే, మొదటి వారమే చెక్కేసింది.
సెకండ్ వీక్ ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరించిన శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. శేఖర్ బాషా నామినేషన్స్ లో ఉన్నవారందరి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్. మంచి ఎంటర్టైనర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల శేఖర్ బాషా భార్య ప్రసవించింది. శేఖర్ బాషా కి కొడుకు పెట్టాడు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించాడు. శేఖర్ బాషా కంటెస్టెంట్స్ నిర్ణయం ఆధారంగా ఎలిమినేట్ చేశారు.
బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేషన్ అనంతరం హౌస్లో 12 మంది ఉన్నారు. వీరి నుండి విష్ణుప్రియ, నాగ మణికంఠ, నైనిక, ప్రేరణ, యష్మి గౌడ, అభయ్, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. ఈ 8 మందిలో ఒకరు ఇంటి వీడాల్సి ఉంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. పోలింగ్ చివరి దశకు వచ్చింది.
వివిధ సంస్థలు నిర్వహించే అనధికార బిగ్ బాస్ పోల్స్ ప్రకారం.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మేల్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది. హౌస్ మేట్స్ అందరిలో విష్ణుప్రియ పాపులర్. ఆమె గేమ్ కొంచెం అటూ ఇటూ ఉన్నా.. ఓట్లు పడుతున్నాయి. ఆమె లీడింగ్ లో ఉన్నారట. అనంతరం నాగ చైతన్య రెండవ స్థానంలో ఉన్నాడట.
ప్రేరణ, యష్మి వారి తర్వాత స్థానాల్లో ఉన్నారట. నైనిక సైతం సేఫ్ అంటున్నారు. చివరి మూడు స్థానాల్లో సీత, పృథ్విరాజ్, అభయ్ నవీన్ ఉన్నారట. అభయ్ నవీన్ పలు చిత్రాలు, సిరీస్లలో నటించాడు. నటుడిగా గుర్తింపు ఉంది. అయినప్పటికీ అతడికి అత్యల్పంగా ఓట్లు పోల్ అయ్యాయట. ఏడవ స్థానంలో పృథ్విరాజ్, ఎనిమిదవ స్థానంలో అభయ్ ఉన్నారట. కాబట్టి అభయ్ ఎలిమినేట్ అవుతున్నాడని సమాచారం.
Web Title: Bigg boss 8 telugu shocking result in latest voting strong contestant goes home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com