Money transfer with UPI : ప్రస్తుత కాలంలో అంతా డిజిటల్ పేమేంట్ హవా నడుస్తోంది.రూ. 10 నుంచి లక్షల రూపాయల వరకు ఆన్ లైన్ లోనే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. చేతిలో మొబైల్ ఉండి..బ్యాంకులో డబ్బు ఉంటే చాలు.. ఎక్కడున్నా డబ్బులను ఇతరులకు పంపొచ్చు. అంతేకాకుండా దాదాపు లక్ష రూపాయల వరకు ఒకేసారి సెండ్ చేయొచ్చు. అయితే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏదైనా అవసరం కోసం బయటకు వెళ్లారు. అప్పుడు వారికి డబ్బు అవసరం ఏర్పడింది. కానీ వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేవు. అప్పుడు మీరు వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పంపిస్తేనే.. వారు ఏదైనా పేమేంట్ చేస్తారు. కానీ ఇప్పుడు అలా కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా వాళ్లు డబ్బులు చెల్లించొచ్చు. అదెలాగో చూడండి..
ప్రస్తుత కాలంలో డబ్బు చాలా అసవరం. ప్రతీ వస్తువు డబ్బు లేనిదే రాదు. అయితే అందరి వద్ద ఒక్కోసారి డబ్బు ఉండకపోవచ్చు. అలాగని ఇంట్లో ఉన్న వాళ్లందరి చేతిలో నగదు ఉండకపోవచ్చు. ఉన్నా.. ఒక్కోసారి అవి ఏదో రకంగా ఖర్చులు కావొచ్చు. అయితే కొన్ని అవసరాల నిమిత్తం బయటకు వెళ్తుంటారు. ఏదైనా డబ్బు అవసరం పడుతుంది. ఈ సమయంలో వారి చేతిలో డబ్బులు లేకపోవచ్చు. ఒకవేళ వారి దగ్గర మొబైల్ ఉండి.. అందులో ఫోన్ పే యాప్ ఉండొచ్చు.. కానీ వారి బ్యాంకులో తగిన అమౌంట్ లేకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయి.
ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఫోన్ పే యూపీఐ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ యూపిఐ పేమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీతో పాటు మీ వైఫ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలా మొత్తం 5 గురు సభ్యుల్లో ఇందులో ఉంటారు. వారు ఎవరికైనా డబ్బు అవసరం ఉన్నప్పుడు పేమెంట్ చేస్తారు. కానీ మీ బ్యాంకు అకౌంట్ నుంచే డబ్బులు చెల్లిస్తారు.
అయితే ఇలాంటి సమయంలో కొన్ని చిక్కులు లేకపోలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల్లో అందరూ ఒకేలా ఉండరు. కొందరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వారిపై మీకు అనుమానం కలిగిస్తే Allow permision అనే ఆప్షన్ ను ఏర్పాటు చేసుకోవాలి. అంటే వారు ఏదైనా పేమేంట్ చేసే సమయంలో అని జెన్యూ అయితే వారికి పర్మిషన్ ఇస్తేనే డబ్బులు పే అవుతాయి. లేకుంటే మీరు ఆ పేమెంట్ ను రిజెక్ట్ చేస్తారు.
మొబైల్ నుంచి మనీ ట్రాన్స్ ఫర్ అలవాటు అయ్యాక చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. అంతేకాకుండా నేటి కాలంలో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఉంటుంది. కానీ వారి వద్ద డబ్బులు ఉండడం లేదు. ఇలాంటి సమయంలో ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులను సైతం ఇందులో చేర్చుకుంటే వారు ఈ సౌకర్యం ద్వారా పేమేంట్ చేసుకుంటారు. అప్పుడు మీరు ప్రత్యేకంగా వారికి డబ్బలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.