Shekhar Basha : తన అరెస్ట్ పై మొట్టమొదటిసారి స్పందించిన ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ శేఖర్ బాషా..వైరల్ అవుతున్న వీడియో!

శేఖర్ బాషా ఎక్కువగా వివాదాల్లో తలదూరుస్తాడు అనేది ఆయన్ని అనుసరించే ప్రతీ ఒక్కరికి అర్థం అవ్వుద్ది. బిగ్ బాస్ హౌస్ లోకి ఆయన అడుగుపెట్టే ముందు రాజ్ తరుణ్ , లావణ్య వివాదం లో తలదూర్చి ఎన్నో లైవ్ డిబేట్స్ లో పాల్గొన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ పాపులారిటీ కారణంగానే బిగ్ బాస్ లో ఆయనకీ అవకాశం వచ్చింది.

Written By: Vicky, Updated On : October 20, 2024 1:58 pm

Shekhar Basha

Follow us on

Shekhar Basha : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో, అయ్యో పాపం అన్యాయంగా ఎలిమినేట్ చేసారు అని ఆడియన్స్ ఫీలైన కంటెస్టెంట్ శేఖర్ బాషా. ఇతని మాట తీరు, వేసే జోకులు, హుషారుగా టాస్కులు ఆడే విధానం, ఇవన్నీ చూస్తే రెండవ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అసలు కాదు అనేది అందరికీ అర్థం అవుతుంది. కానీ ఇతనికి మొదటి వారం వచ్చిన కంటెంట్, రెండవ వారం అసలు రాకపోవడం వల్లనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని, అందులోనూ ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదని, కేవలం కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా మాత్రమే ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇతను హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ తో పాటుగా రీ ఎంట్రీ ఇస్తాడని అందరూ ఊహించారు కానీ, అలా ఎంట్రీ ఇవ్వాలంటే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం కనీసం నాలుగు వారాలు అయినా హౌస్ లో ఉండి ఎలిమినేట్ అవ్వాలి.

గత సీజన్ లో కూడా అదే జరిగింది. ఇదంతా పక్కన పెడితే శేఖర్ బాషా ఎక్కువగా వివాదాల్లో తలదూరుస్తాడు అనేది ఆయన్ని అనుసరించే ప్రతీ ఒక్కరికి అర్థం అవ్వుద్ది. బిగ్ బాస్ హౌస్ లోకి ఆయన అడుగుపెట్టే ముందు రాజ్ తరుణ్ , లావణ్య వివాదం లో తలదూర్చి ఎన్నో లైవ్ డిబేట్స్ లో పాల్గొన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ పాపులారిటీ కారణంగానే బిగ్ బాస్ లో ఆయనకీ అవకాశం వచ్చింది. అదే విధంగా శేఖర్ బాషా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసు లో కూడా చిక్కుకున్నాడని, హర్ష సాయి మీద కేసు వేసిన మిత్రా శర్మ శేఖర్ బాషా మీద కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని, దీంతో ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి.

దీనిపై శేఖర్ బాషా స్పందిస్తూ ‘నేను అరెస్టు అయ్యినట్టు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అలాంటిదేమి జరగలేదు. గచ్చిబౌలి లో జరిగిన ప్రో కబ్బడి మ్యాచుకు వెళ్ళాను. అక్కడి నుండి తిరిగి వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. ఈ మూడు గంటల సమయంలో ఇంత విద్వంసం జరుగుతుందని అనుకోలేదు. నేను చెప్తే మీరు నమ్మరు ఏమో, ఇదిగోండి ఈరోజుటి న్యూస్ పేపర్..దయచేసి నన్ను అభిమానించే వాళ్ళు కంగారు పడకండి. నేను అరెస్ట్ కాలేదు, క్షేమంగా మా ఇంట్లోనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత శేఖర్ బాషా అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూస్ లలో రీ ఎంట్రీ అవకాశం ఉంటే కచ్చితంగా వస్తాను అని చెప్పుకొచ్చాడు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అది అసాధ్యం అనే చెప్పాలి.