https://oktelugu.com/

Sobhita Dhulipalla : ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అంటూ నాగ చైతన్య తో కలిసి శోభిత ధూళిపాళ్ల సంచలన కామెంట్స్..వైరల్ అవుతున్న ఫోటో!

సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తుండే శోభిత, రీసెంట్ గా నాగ చైతన్య తో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిశ్చితార్ధ వేడుక తర్వాత, మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఫోటో అప్లోడ్ ఇప్పుడే అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 02:45 PM IST

    Sobhita Dhulipalla

    Follow us on

    Sobhita Dhulipalla : ఆగస్టు 8 వ తారీఖున అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి డేటింగ్ చేసుకుంటున్న ఈ జంట, అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ ఈ ప్రకటన చేసారు. వీళ్లిద్దరి నిశ్చితార్థం ఇండస్ట్రీ లో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం. ఎన్నో ఏళ్ళ నుండి జవాబు దొరకని ప్రశ్నలకు ఈ ఒక్క ఘటనతో జవాబులు దొరికాయి. కలిసి ఒక్క సినిమాలో కూడా నటించిన వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ మిస్టరీ అనే చెప్పాలి. వీళ్లిద్దరు నోరు విప్పితే కానీ దానికి సమాధానం దొరకదు. అప్పటి వరకు ఊహాగానాలే సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ ఉంటాయి.

    ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ ఉంటూ తనకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తుండే శోభిత, రీసెంట్ గా నాగ చైతన్య తో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిశ్చితార్ధ వేడుక తర్వాత, మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఫోటో అప్లోడ్ ఇప్పుడే అయ్యింది. ఈ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘ప్రతీ చోట..ఒకేసారి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి..ఇది నేను కూడా ఊహించలేదు’ అంటూ ఇంగ్లీష్ లో ఒక క్యాప్షన్ పెట్టింది. ఇది కావాలని సమంత ని ఉడికించేందుకే శోభిత అలా పెట్టిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

    ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరి పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయట. ఈమధ్య సెలబ్రిటీస్ డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాల్లో, తమకి ఇష్టమైన చోట పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లి కూడా అదే విధంగా జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. సాధారణంగా మన సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు పుట్టి పెరిగిన ఊరిలో పెళ్లి చేసుకుంటారు. ఆ పద్దతిని అనుసరిస్తే శోభిత, నాగ చైతన్య పెళ్లి తెనాలి లో జరగాలి. ఎందుకంటే శోభిత సొంత ఊరు అదే కాబట్టి. సంప్రదాయాలను నిక్కచ్చి అనుసరిస్తాను అని అనేక సందర్భాలలో చెప్పుకొచ్చిన శోభిత, మరి తన పెళ్లి మాత్రం ఎందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాల్లో చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇదంతా పక్కన పెడితే శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం బాలీవుడ్ ట్రెండ్ అవుతున్న టాప్ మోస్ట్ యంగ్ హీరోయిన్స్ లో ఒకరు. ఈ ఏడాది ఆమె ‘మంకీ మ్యాన్’ అనే ఇంగ్లీష్ చిత్రం, ‘లవ్ సితార’ అనే బాలీవుడ్ చిత్రం చేసింది. వీటితో పాటు బాలీవుడ్ లో మరికొన్ని వెబ్ సిరీస్ లలో నటించేందుకు సంతకం చేసిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. పెళ్లి తర్వాత కూడా ఆమె ఎప్పటిలాగానే సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతానని ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.