Bigg Boss 7 Telugu : ఇలాంటి ఎలిమినేషన్ ఊహించలేదు… ఆ ఇద్దరిలో ఒకరు అవుట్, స్వయంకృతాపరాధం!

కాగా రతిక, యావర్ ఇద్దరిలో ఈ వారం రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రతిక మాయలో పడి యావర్ టాప్ నుండి క్రిందకు పడిపోయాడు.

Written By: NARESH, Updated On : November 8, 2023 9:09 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 పదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సరికొత్తగా సాగింది. రాజమాతలు,ప్రజలు అంటూ కొత్త కాన్సెప్ట్ తో ఈ వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. రాజమాతలు అశ్విని, ప్రియాంక, శోభ, రతిక లు ఏకాభిప్రాయంతో గౌతమ్ కృష్ణ,భోలే షావలి,శివాజీ లను నామినేట్ చేశారు. ఇక ప్రిన్స్ యావర్,శివాజీ ఇద్దరు అమర్ ని నామినేట్ చేశారు. దీంతో శోభా ఇద్దరు ఒకరినే నామినేట్ చేస్తే ఎలా బిగ్ బాస్ అని కంప్లైంట్ చేసింది.

దాంతో ఇద్దరు ఒకర్నే నామినేట్ చేయడానికి వీలు లేదంటూ బిగ్ బాస్ తెలిపారు. దీంతో తన దగ్గర వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి రీజన్ లేదు అని యావర్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రాజమాతలు మధ్య నామినేషన్ జరిగింది. ఇందులో ప్రియాంక, రతిక రెండు రెండు ఓట్లతో టై గా నిలిచారు. ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలని నిర్ణయాన్ని కెప్టెన్ శోభా చేతిలో పెట్టాడు బిగ్ బాస్.

శోభా శెట్టి అందరూ ఊహించినట్టే తన సీరియల్ బ్యాచ్ సభ్యురాలైన ప్రియాంకను సేవ్ చేసింది. రతిక ను నామినేషన్ లోకి తోసింది. కాగా మొత్తానికి పదో వారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, భోలే షావలి, రతిక రోజ్ ఉన్నారు.

పదో వారం ఓటింగ్ రిజల్ట్స్ విషయానికొస్తే టైటిల్ ఫేవరెట్ శివాజీకి భారీగా ఓటింగ్ నమోదవుతుంది. దాదాపు 35 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయని సమాచారం.మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో ఉన్నాడు. ఊహించని విధంగా భోలే మూడో ప్లేస్ లో ఉన్నాడు. కాగా రతిక చివరి స్థానంలో ఉంది. ఈ వారం మొదట్లో రెండవ స్థానంలో ఉన్నా యావర్ నాలుగో స్థానానికి పడిపోయాడు. దీంతో వీళ్లిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. కాగా రతిక, యావర్ ఇద్దరిలో ఈ వారం రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రతిక మాయలో పడి యావర్ టాప్ నుండి క్రిందకు పడిపోయాడు.