Bigg Boss 7 Telugu Wild Card: చెప్పినట్లే బిగ్ బాస్ తెలుగు 7 కొంచెం భిన్నంగా సాగుతుంది. అంచనాలకు మించి ఉంది. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కాగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇక ఎన్నడూ లేని విధంగా సెకండ్ లాంచ్ ఈవెంట్ కి రంగం సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 3న జరిగిన లాంచింగ్ ఎపిసోడ్లో 14 మంది కంటెస్టెంట్స్ ని మాత్రమే ప్రవేశ పెట్టారు. వీరు హౌస్ మేట్స్ కాదని, పవర్ అస్త్ర గెలిచి ఆ హోదా పొందాలి అన్నారు. ఇక నాలుగు వారాలు ముగియగా… నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.
ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో 7గురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 8న మరో లాంచింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్లో 6 నుండి 7గురు కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెడతారట. వీరిలో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీరియల్ యాక్టర్స్ అంబటి అర్జున్, అంజలి పవన్, పూజా మూర్తితో పాటు సింగర్ భోలే షావలీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అట.
భారీ ట్విస్ట్ ఏంటంటే.. ఆల్రెడీ ఎలిమినేటైన దామిని, రతికా రోజ్ సైతం రీఎంట్రీ ఇచ్చే అవకాశం కలదంటున్నారు. ఉన్న పది మంది కంటెస్టెంట్స్ నుండి ఇద్దరిని ఎలిమినేట్ చేయడం మరో ట్విస్ట్ అట. అలాగే ఓ కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ కి పంపుతారట. దాంతో ఏడుగురు సభ్యులు ఉంటారు. మరో ఏడుగురు కొత్త వాళ్ళను పంపుతారట. అప్పుడు మరలా 14 మందితో షో మొదలవుతుందట.
మినీ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ విడుదల చేశారు. నాగార్జున నెక్స్ట్ సండే మీ ఊహకు అందనిదీ, ఎన్నడూ చూడనిదీ పరిచయం చేయబోతున్నాం అన్నారు. ఈ సీజన్ అంతా ఉల్టా ఫల్టా గా సాగుతుందని చెప్పారు. ఇక నెక్స్ట్ సండే ఎపిసోడ్ 7 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. మరి చూడాలి సెకండ్ లాంచ్ ఈవెంట్లో ఎవరెవరిని పరిచయం చేస్తారో…
Get ready for a rollercoaster ride of surprises! 🔄 Nagarjuna is turning things Ulta Pulta this Sunday in the Bigg Boss House. Brace yourself for the unexpected twist that will leave you on the edge of your seat! 🤯 #BiggBossTelugu7 @iamnagarjuna #StarMaa https://t.co/hMKb9vDtgm
— Starmaa (@StarMaa) October 5, 2023