https://oktelugu.com/

Tollywood Music Directors: ఇండస్ట్రీ లో ఉన్న బెస్ట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ల కాంబో ఇదే…

సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంటే ఆయన తీసిన ఆర్య సినిమా నుంచి ఇప్పుడు రాబోయే పుష్ప 2 సినిమా వరకు అన్ని సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పనిచేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2023 / 06:09 PM IST

    Tollywood Music Directors

    Follow us on

    Tollywood Music Directors: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకి మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్ కి అయితే ఇక్కడ ఎనలేని క్రేజ్ ఉంటుంది. అలాగే కొన్ని కాంబినేషన్ లలో వచ్చిన సినిమాలకు కూడా ఇక్కడ మంచి సక్సెస్ రేట్ ఉంటుంది.అయితే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఒక అనుబంధం అనేది ఉండాలి. అలా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడే మంచి మ్యూజిక్ రావడానికి అయిన అలాగే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవడానికి అయిన చాలా బాగుంటుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

    రాజమౌళి, ఎంఎం కీరవాణి
    రాజమౌళి తీసిన నె స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా దాకా అన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం ఎం కీరవాణి గారే చేశారు. అయితే ప్రతి సినిమాకి కీరవాణి గారే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎందుకు ఉంటారు మీరు వేరే వాళ్ళని ఎందుకు పెట్టుకోరు అని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ని క్వశ్చన్ అడిగగా ఆయన దానికి సమాధానం గా నాకు మ్యూజిక్ మీద పెద్దగా అవగాహన లేదు కాబట్టి వేరే వాళ్ళని తీసుకుంటే నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు,అదే పెద్దన్న అయితే నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలి అనేది నేను చెప్పగానే పెద్దన్న అర్థం చేసుకొని మ్యూజిక్ ఇస్తాడు అలాగే నేను ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటానో నా టేస్ట్ తెలుసుకుని మరి అలాంటి మ్యూజిక్ ఇస్తూ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా మ్యూజిక్ కొడతారు అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఇది ఇక ఉంటే వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అవడమే కాకుండా సినిమాల పరంగా కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు కీరవాణి…

    సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్
    సుకుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంటే ఆయన తీసిన ఆర్య సినిమా నుంచి ఇప్పుడు రాబోయే పుష్ప 2 సినిమా వరకు అన్ని సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ పనిచేశాడు. బేసిగ్గా వారికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి సినిమా కి ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటాడు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా మ్యూజికల్ గా మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే వీళ్ళ కాంబినేషన్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది…

    లోకేష్ కనకరాజు, అనిరుద్
    విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి లోకేష్ కనక రాజు ఎంత కారణమో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ కూడా అంతే కారణమని చెప్పాలి.ఈ సినిమా విజయంలో ఆయన పాత్ర చాలా ఉంటుంది. ఇక విక్రమ్ కంటే ముందు వచ్చిన మాస్టర్ సినిమాలో కూడా అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. లోకేష్ కనకరాజుకి అనిరుద్ మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం అంటే ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మొత్తం అనిరుధ్ కే అప్పచెప్పి చెప్పి లోకేష్ కనకరాజు పక్కన కూర్చుంటారంట దాంతో అనిరుద్ ఏ మ్యూజిక్ కొట్టిన కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మ్యూజిక్ డైరక్టర్ అయిన అనిరుధ్ బాగా ఆలోచించిన తర్వాతే మ్యూజిక్ ఇస్తాడు కాబట్టి దాన్ని లోకేష్ కనకరాజు కూడా సినిమాలో పెట్టేసుకుంటాడు అలా వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ చాలా గొప్పది.అందుకే వీళ్లది ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్ గా ముందుకు సాగుతుంది…