Ghajini: గజిని సినిమాని వదులుకొని బాధపడిన ఆ స్టార్ హీరో…

గజినీ అనే ఒక్క సినిమాతోనే సూర్య తెలుగులో స్టార్ హీరో అయిపోయాడు అదే సినిమా విక్రమ్ చేసి ఉంటే ఆయనకి కూడా మంచి పేరు వచ్చుండేది.

Written By: Gopi, Updated On : October 5, 2023 5:54 pm

Ghajini

Follow us on

Ghajini: సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం… అంటే ఒక హీరోకి ఆ స్టోరీ నచ్చకపోవడం వల్ల గాని లేదా ఆ పరిస్థితుల్లో ఆ హీరో తన డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్ల గాని సినిమాలు మిస్ చేసుకోవాల్సి వస్తుంది. అలా సినిమాలు మిస్ చేసుకున్న సినిమాలు మరొక హీరో చేసి ఆయన కెరియర్ లోనే ఆ సినిమా ది బెస్ట్ హిట్ గా నిలిస్తే మాత్రం ఆ సినిమాని వదిలేసుకున్న హీరో చాలా బాధపడిపోతాడు.

అయితే ఇండస్ట్రీ లో అలాంటి సంఘటనలు తరుచూ గా జరుగుతూనే ఉంటాయి…మురుగదాస్ డైరెక్షన్ లో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాని డైరెక్టర్ మురుగదాస్ మొదట విక్రమ్ ని హీరోగా పెట్టి చేద్దామని అనుకున్నడట, కానీ అప్పుడు విక్రమ్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాని వదిలేసుకున్నాడు.దాంతో ఆ సినిమా సూర్య దగ్గరికి వెళ్ళింది.సూర్య అప్పటికి ఒకటి , రెండు సినిమాలు చేసినప్పటికీ ఆయనకు తమిళంలో పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. దాంతో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా షూటింగ్ నడిచింది.ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా నార్మల్ గా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అంచనాలు లేకుండా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో సూర్య ఒకసారి గా స్టార్ హీరో అయిపోయాడు తమిళం తో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక స్టార్ వాల్యును ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఈ సినిమాను మిస్ చేసుకున్న విక్రమ్ మాత్రం చాలా సందర్భాల్లో ఆ సినిమా గురించి చెబుతూ తను మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నాను అని కూడా చెప్పాడు. అలా ఒక సినిమాను మిస్ చేసుకోవడం వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది అనేది విక్రమ్ ని చూస్తే తెలుస్తుంది.

గజినీ అనే ఒక్క సినిమాతోనే సూర్య తెలుగులో స్టార్ హీరో అయిపోయాడు అదే సినిమా విక్రమ్ చేసి ఉంటే ఆయనకి కూడా మంచి పేరు వచ్చుండేది.ఇక ఆ సినిమా మిస్ అయిన కూడా ఆ తర్వాత విక్రమ్ శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు అనే సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో విక్రమ్ కి తెలుగులో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. అపరిచితుడు సినిమా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విక్రమ్ కి ఒక్కటి కూడా సరైన హిట్టు లేదు. దాంతో తెలుగులో ఇప్పుడు ఆయన మార్కెట్ కొంచెం డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే సినిమాలతో విక్రమ్ మరో హిట్టు కొట్టి తన మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నాడు…అయితే సూర్య, విక్రమ్ ఇద్దరు కలిసి ముందు గా బాలా డైరెక్షన్ లో చేసిన శివ పుత్రుడు సినిమా కూడా తెలుగు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ అది కంటెంట్ బేస్డ్ మూవీ కాబట్టి సినిమా హిట్ అయింది, కానీ వీళ్ళకి కమర్షియల్ గా గుర్తింపు అయితే రాలేదు…