Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా జరుగుతోంది. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అర్థం కావడం లేదు. ఊహించని షాక్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ ఇప్పటివరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే గత మూడు వారాల నుండి హౌస్ లో లేడీ కంటెస్టెంట్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా , దామిని ముగ్గురు మూడు వారాల్లో హౌస్ నుంచి వెళ్లిపోయారు.
ఇక నాలుగో వారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ వారం రతిక, ప్రిన్స్ యావర్ , గౌతమ్ కృష్ణ , టేస్టీ తేజ , శుభశ్రీ , ప్రియాంక జైన్ నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ పక్రియను సరికొత్తగా నిర్వహించాడు బిగ్ బాస్. శోభా శెట్టి , ఆట సందీప్ , శివాజీ లను జడ్జి లుగా పెట్టి నామినేషన్ ఘట్టం మొదలుపెట్టారు. ఇందులో ఒక్కో హౌస్ మేట్ ఇద్దరినీ నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గ కారణాలు జడ్జీలకు చెప్పాలి. వాటిని విని జడ్జీలు ఆ ఇద్దరిలో ఒకరిని మాత్రమే నామినేట్ బోర్డ్ లో పెడతారు.
ఈ పక్రియ లో శోభశ్రీ , రతిక మరియు ప్రిన్స్ యావర్ , గౌతమ్ కృష్ణ మధ్య జరిగిన వాదనలు హైలైట్ అని చెప్పాలి. ముందుగా శోభ శ్రీ రతిక మరియు అమర్ దీప్ ను నామినేట్ చేసింది. ముఖ్యంగా రతిక విషయంలో శోభ శ్రీ చెప్పిన కారణాలు వివాదానికి దారితీశాయి. బిగ్ బాన్ రూల్స్ ప్రకారం బయటనున్న సెలెబ్రెటీస్ గురించి హౌస్ లో మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది . క్రితం నామినేషన్ టైం లో తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ మైండ్ ఆఫ్సెట్ అయ్యి నామినేట్ చేసానని చెప్పింది . అందుకే ఈ వారం నామినేట్ చేస్తున్న అని చెప్పింది.
దీనితో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. చివరికి ఒకరి క్యారెక్టర్ గురించి మరొకరు కామెంట్ చేసుకునే స్థాయికి గొడవ వెళ్ళింది. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ , గౌతమ్ కృష్ణ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఒక దశలో సహనం కోల్పోయిన యావర్ గౌతమ్ కృష్ణ మీదకు దూసుకెళ్లాడు. మధ్యలో శివాజీ , సందీప్ యావర్ ను వెనక్కి పిలిచిన కానీ యావర్ మాట వినలేదు. పైగా సందీప్ తో కూడా వాదనకు దిగాడు. చివరికి అతని బిహేవియర్ ను తప్పు పడుతూ అతన్ని నామినేట్ చేశారు
ఇక వోటింగ్ విషయానికి వస్తే అత్యధికంగా ఓట్లతో అంటే 35 నుంచి 40 శాతం ఓట్ల ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ప్రియాంక జైన్ 20 నుంచి 25 శాతం ఒట్లు, ఆ తర్వాత రతిక 10 నుంచి 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో, గౌతమ్ 10 శాతానికిపైగా ఓట్లతో నాలుగో స్థానంలో, 10 శాతం ఓట్లతో టేస్టీ తేజ ఐదో స్థానంలో, శుభ శ్రీ 8 నుంచి 10 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. దాంతో ఈ వారం టేస్టీ తేజ, రతిక డేంజర్‌లో ఉన్నట్టు ఓట్ల శాతం స్పష్టం చేసింది.