Today 6 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గ్రహాల అనుకూలత శక్తివంతంగా ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మరి కొన్ని రాశుల వారు సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి సపోర్టు ఉండటంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు. అనుకున్న కోరికలు నెరవేరడంతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి నుంచి సపోర్టు ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ జీతం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తిపై శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు కొత్త వారితో డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నివారించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు ఒత్తిడితో ఉంటారు. ఇలాంటి సమయంలో ఓపిక చాలా అవసరం. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. మీరు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. పూర్వికుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటుంది. తోటి వారి మద్దతుతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గం ఏర్పడుతుంది జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అప్పులు చెల్లిస్తారు. దీంతో మనశ్శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది.. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు హార్థికంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. రోజువారి పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. దీంతో మనశాంతి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధికారుల మద్దతు ఉంటుంది. పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో మార్పుల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఏర్పాటు చేసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి