https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఎవరూ ఊహించని ఓటింగ్… ఈ వారం హౌస్ నుండి పెద్ద చేప అవుట్!

సీరియల్ బ్యాచ్ గా ముద్ర వేసుకున్న కంటెస్టెంట్స్ లో శోభా శెట్టి ఒకరు. ఈమె ప్రవర్తన గేమ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఆమె హెడ్ వెయిట్ చూసి ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రతిదానికి ఓవర్ యాక్షన్.

Written By: , Updated On : October 27, 2023 / 01:30 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. సెలబ్రిటీ హోదాకు మించి ప్రవర్తన ఆధారంగా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. ఈ షోలో మంచిగా ఆడిన సామాన్యులు కూడా సెలెబ్రిటీలు అయ్యారు. సెలెబ్రిటీలు చెత్త గేమ్ తో ఉన్న ఫేమ్ కూడా పోగొట్టుకున్నారు. ఈ షోలో అండర్ డాగ్స్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్, యావర్, భోలే వంటి వారు దూసుకుపోతున్నారు. వీరికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది. అదే సమయంలో సెలెబ్రిటీలుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు నెగిటివిటీ మూటగట్టుకుంటున్నారు.

సీరియల్ బ్యాచ్ గా ముద్ర వేసుకున్న కంటెస్టెంట్స్ లో శోభా శెట్టి ఒకరు. ఈమె ప్రవర్తన గేమ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఆమె హెడ్ వెయిట్ చూసి ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రతిదానికి ఓవర్ యాక్షన్. నోటికి వచ్చినట్లు మాట్లాడటం. శోభా ఆరో వారమే ఎలిమినేట్ కావాల్సింది. ఆమెకు బదులు నయని పావనిని బలి చేశారనే వాదన ఉంది. అయితే ఈ వారం ఆమె తప్పించుకోదని టాక్. ఓటింగ్ లో వెనుకబడ్డ శోభా ఈ వారం ఇంటిబాట పట్టడం ఖాయం అంటున్నారు.

8వ వారానికి శివాజీ, అమర్, భోలే, సందీప్, ప్రియాంక, శోభా, అశ్విని, గౌతమ్ నామినేట్ అయ్యారు. దాదాపు 46 శాతం ఓటింగ్ తో శివాజీ టాప్ లో దూసుకుపోతున్నాడట. సీరియల్ బ్యాచ్ చేత టార్గెట్ చేయబడిన భోలే రెండో స్థానంలో ఉండడం విశేషం. అమర్ మూడో స్థానంలో ఉండగా… అశ్విని నాలుగో స్థానం, గౌతమ్ ఐదో స్థానంలో ఉన్నారట.

ఇక ఆరో స్థానంలో ప్రియాంక ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభా ఉన్నారట. ప్రియాంక, శోభా, సందీప్ మధ్య ఓట్ల వ్యత్యాసం పెద్దగా లేదట. సందీప్, ప్రియాంక కంటే.. శోభా వెనుకబడిందట. దాదాపు శోభా శెట్టి ఇంటిని వీడటం ఖాయం అంటున్నారు. శోభా ఎలిమినేట్ అయితే… సీరియల్ బ్యాచ్ లోని పెద్ద చేప ఇంటిని వీడినట్లు అవుతుంది. అప్పుడు ప్రియాంక, అమర్ మాత్రమే మిగులుతారు.