Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. పదకొండవ వారం కూడా ముగింపు దశకు వచ్చేసింది. కాగా ఈ వారం నామినేషన్ లిస్ట్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అంబటి అర్జున్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, అశ్విని శ్రీ లిస్ట్ లో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. అయితే ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే రతిక రోజ్, అశ్విని ఇద్దరు డేంజర్ జోన్ ఉన్నారు.
ఓటింగ్ ప్రక్రియ మొదలైన మొదటి రోజు నుంచే యావర్ అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. కాగా నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అమర్ పడిన బాధ చూసి ఆడియన్స్ ఓట్లు గుద్ది పడేశారు. దాంతో యావర్ ని కిందకి నెట్టి అమర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక గౌతమ్ మూడో స్థానంలో ఉన్నాడు. అర్జున్ నాలుగో స్థానంలో .. ప్రియాంక ఐదవ స్థానంలో ఉండగా .. శోభా ఆరో స్థానంలో ఉంది. వీళ్ళందరూ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అని చెప్పవచ్చు.
బిగ్ బాస్ ముద్దు బిడ్డ రతిక రోజ్, అశ్విని శ్రీ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. కాబట్టి ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. రతిక ని ఏదో విధంగా బిగ్ బాస్ కాపాడుకుంటాడు. కాబట్టి ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి అశ్విని శ్రీ ని బయటకు పంపిస్తారని అంతా భావిస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. ఏదైనా జరగొచ్చు .. మిగిలింది నాలుగు వారాలు మాత్రమే డబల్ ఎలిమినేషన్ జరిగిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కానీ .. ఎక్కువ శాతం సింగల్ ఎలిమినేషన్ ఉంటుంది. అన్ అఫీషియల్ పోల్స్ ప్రకారం శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ లెక్కల ప్రకారం అయితే అశ్విని లేదా రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. మరో వైవు నో ఎలిమినేషన్ కూడా అంటున్నారు. ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవచ్చట.