Bigg Boss 7 Telugu: వారం వారం సమీకరణాలు మారిపోతున్నాయి. ఫైనల్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు అటు ఇటు అవుతున్నాయి. సర్వేలలో షాకింగ్ ఫలితాలు వస్తున్నాయి. గత నెల సర్వే ఫలితాలు ప్రస్తుత నెలకు తారుమారయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ నవంబర్ 3 వరకు సర్వే రిజల్ట్ విడుదల చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో వెల్లడించారు. బిగ్ బాస్ షో ప్రేక్షకుల ఆడియన్స్ అభిప్రాయంలో శివాజీ టాప్ లో ఉన్నారు. శివాజీ సీనియర్ నటుడు. అతనికంటూ జనాల్లో ఫేమ్ ఉంది. దానికి తోడు కూల్ గా గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని ఆకర్షిస్తున్నాడు.
రెండో స్థానంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టాడు. టాస్క్స్ లో సత్తా చాటుతున్న పల్లవి ప్రశాంత్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. పవర్ అస్త్ర గెలిచి రెండు వారాలు ఇమ్యూనిటీ పొందాడు. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో ప్రియాంక ఉంది. ప్రియాంక సీరియల్ నటిగా ఫ్యాన్ బెస్ట్ ఉన్న కంటెస్టెంట్. గత వారం కెప్టెన్సీ కంటెండర్ గా ఉంది. ఈ క్రమంలో ప్రియాంక టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు.
టైటిల్ ఫేవరేట్ గా హౌస్లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ అమర్ దీప్. అయితే అమర్ ఉన్న ఇమేజ్ కూడా పోగొట్టుకున్నాడు. మనోడిలో ఈర్ష్య తప్పితే విషయం లేదని తేలిపోయింది. అమర్ తెలివి తక్కువ గేమ్ ఆడుతూ నాగార్జునతో చివాట్లు తిన్నాడు. ఈ మధ్య కొంచెం ఆట మెరుగైంది. సీరియల్ హీరో కావడంతో ప్రేక్షకుల్లో ఇమేజ్ ఉంది. అది అమర్ కి బాగా ఉపయోగపడుతుంది. ఈ కారణంగా నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక టాప్ 5 లో చోటు దక్కించుకున్న చివరి కంటెస్టెంట్ గౌతమ్. ఈ డాక్టర్ కమ్ యాక్టర్ ఒకసారి హౌస్ కి కెప్టెన్ అయ్యాడు. కసితో గేమ్ ఆడుతున్నాడు. గౌతమ్ లో కొన్ని మైనస్ లు ఉన్నా నిలకడగా గేమ్ ఆడుతున్నాడు. అందుకే ప్రేక్షకులు 5వ స్థానంలో నిలబెట్టారు. గతంలో గౌతమ్ టాప్ 5లో లేడు. కాగా గత నెలలో టాప్ 5లో ఉన్న అర్జున్ స్థానం కోల్పోయాడు. ప్రస్తుతానికి శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, అమర్, గౌతమ్ ఫైనల్ లో ఉంటారని ప్రేక్షకుల అభిప్రాయం.