Prince Yawar- Ratika Rose: బిగ్ బాస్ హౌస్లో ప్రేమ కథలు కామనే. రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్ సార్థక్-మోనాల్, అభిజీత్-అలేఖ్య హారిక, షణ్ముఖ్-సిరి… బిగ్ బాస్ లవర్స్ గా పేరుగాంచారు. సీజన్ 7 మొదలై రెండు వారాలు ముగియగా ఇప్పుడిప్పుడే ఒంటరిగా ఉన్నవాళ్లు జంటలు అవుతున్నారు. గౌతమ్ కృష్ణ వచ్చిన వెంటనే శుభశ్రీని లైన్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇంకా ప్రేమికులమని ఓపెన్ కాలేదు. వీరి కంటే ముందు రతికా-ప్రిన్స్ యావర్ ప్రేమ పక్షులుగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి.
కొద్దిరోజులుగా ప్రిన్స్ యావర్ రతికా మాయలో పడిపోయాడు. తన మాటలు, నవ్వులతో మనోడిని ముగ్గులోకి లాగింది. మొదట్లో పల్లవి ప్రశాంత్ ని ట్రై చేసిన రతికా మనసు మార్చుకుంది. పల్లవి ప్రశాంత్ తో స్నేహం చేస్తూనే నామినేషన్స్ లో ఝలక్ ఇచ్చింది. హౌస్లో ఏం పీకుతున్నావ్ అంటూ నామినేట్ చేసింది. పల్లవి ప్రశాంత్ కి దూరమయ్యాక ప్రిన్స్ యావర్ తో సన్నిహితంగా ఉంటుంది.
అయితే అతనితో కూడా విశ్వాసంగా ఉండటం లేదు. బిగ్ బాస్ నెక్స్ట్ పవర్ అస్త్ర గెలిచే ఛాన్స్ అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలకు ఇచ్చాడు. వీరిలో ఎవరికి పవర్ అస్త్ర గెలిచే అర్హత లేదో చెప్పాలని ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అడిగాడు బిగ్ బాస్. అప్పుడు రతికా ప్రిన్స్ యావర్ పేరు చెప్పింది. అతనితో తీయని మాటలు చెబుతూ కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చింది. ఆమెతో గొడవపడే అమర్ దీప్, శోభా శెట్టిని కాకుండా యావర్ పేరు చెప్పింది.
ఎవరు ఎవరిని రిజెక్ట్ చేశారో కన్ఫెషన్ రూమ్ వీడియోలు బిగ్ బాస్ ప్లే చేశాడు. దాంతో రతికా తనకు చేసిన అన్యాయం యావర్ కి తెలిసింది. అయినా ప్రేమ పిచ్చోడు ఆమెను దూరం పెట్టడం లేదు. నీకు ఏమైనా నేను ఉన్నాను. ఐ యామ్ దేర్ ఫర్ యూ అంటున్నాడు. చపాతీలు వేసి స్వయంగా తినిపించాడు. ఒకే కంచంలో తింటున్నారని ఇంటి సభ్యులు షాక్. పవర్ అస్త్ర విషయంలో రతికా అతనికి అన్యాయం చేసిందని తెలిసి కూడా ఇలా చేస్తున్నాడేంటని ఇంటి సభ్యులు వాపోయారు. చూస్తుంటే రతికా మాయలో యావర్ పడ్డాడు అనిపిస్తుంది.