Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ 8వ వారం చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ మారథాన్ అంటూ పలు టాస్క్స్ నిర్వహించాడు. ప్రతి టాస్క్ లో గెలిచిన హౌస్ మేట్ కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉంటాడని చెప్పాడు. ఫస్ట్ టాస్క్ లో ప్రియాంక గెలిచి కంటెండర్ అయ్యింది. అమర్ రేసు నుండి తప్పుకున్నాడు. రెండో టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. రతిక రోజ్ అర్హత కోల్పోయింది.
ఇక మూడో టాస్క్ లో అర్జున్, అశ్విని, భోలే, సందీప్ పోటీపడ్డారు. తలకు స్పాంజ్ తో కూడిన టోపీలు ధరించి షవర్ క్రింద నిలబడి నీటిని సేకరించాలి. సేకరించిన నీటిని తమ కంటైనర్ లో నింపాలి. ఎవరు ఎక్కువ నీటిని నింపితే వారు గెలుస్తారు. షవర్ వద్ద నీటిని సేకరించే క్రమంలో నలుగురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. అర్జున్ అయితే ఓ దశలో అశ్వినిని తోసేశాడు. ఆమె క్రిందపడిపోయింది. అయితే ఈ టాస్క్ లో సందీప్ గెలిచి కంటెండర్ అయ్యాడు. భోలే రేసు నుండి తప్పుకున్నాడు.
అనంతరం టాస్క్ లో శివాజీ, గౌతమ్, శోభా, అశ్విని పోటీపడ్డారు. తమ ముందు ఉన్న బాక్సులో ఉన్న కలర్ బాల్స్ ఎవరు ముందుగా క్లియర్ చేసి బెల్ కొడతారో వారు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. ఒంటి చేత్తో శివాజీ గట్టి పోటీ ఇచ్చాడు. అశ్విని అందరికంటే ముందు క్లియర్ చేసింది. కానీ గంట కొట్టడటం మర్చిపోయింది. దాంతో గౌతమ్ గెలిచి కంటెండర్ అయ్యాడు. మరో టాస్క్ లో శోభా, తేజ, యావర్ పోటీపడ్డారు.
ఎవరైతే ఎక్కువ బట్టలు ధరిస్తారో వారు విన్ అన్నారు. ఈ టాస్క్ లో శోభా గెలిచింది. ఆమె 72 దుస్తులు ధరించింది. యావర్ 71కి ధరించాడు. దాంతో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభా కెప్టెన్సీ కంటెండర్స్ గా బరిలో నిలిచారు. ఈ మధ్యలో యావర్-అశ్విని మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రియాంక మన ఇద్దరికీ ఎఫైర్ అంటగడుతుందని అశ్విని యావర్ తో అంది. నాకు తెలుసు, వాళ్ళు అంతా ఒక బ్యాచ్ అని యావర్ అన్నాడు. ఇలాంటి ఆసక్తికర విషయంలో ఎపిసోడ్ ముగిసింది…