Odi World Cup 2023: 2023 వరల్డ్ కప్ లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టాప్ టీమ్ లు అన్ని ఓటమిపాలవుతుంటే అసలు ఏ అంచన లేకుండా వరల్డ్ కప్ లోకి వచ్చిన కొన్ని జట్లు మాత్రం అద్భుతాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఇండియా వరుస విజయాలను అందుకుంటూ టాప్ వన్ టీం గా కొనసాగుతుంటే డిపెండ్ ని చాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ మాత్రం వరుస ఓటములను చవిచూస్తుంది.
అయితే వరల్డ్ లోనే గొప్ప టీములుగా వెనుగొందుతున్న ఆస్ట్రేలియా పాకిస్తాన్ లాంటి టీములు కూడా వాళ్ల స్థాయి మేరకు ఆడటం లేదు.ఇక పాకిస్థాన్ టీమ్ ఓటములను చవిచూసి ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతున్నాయి. ఇక పాకిస్తాన్ టీమ్ అయితే వరుస ఓటమిలను చవి చూస్తూ చిన్న జట్ల మీద కూడా ఘోరపరజయాన్ని పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నెదర్లాండ్ టీం సౌత్ ఆఫ్రికా టీం ను దారుణంగా ఓడించింది. ఇక ఆఫ్గనిస్తాన్ టీం అయితే ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్లని ఘోరాతి ఘోరంగా ఓడించింది. నిజానికి ఈ వరల్డ్ కప్ లో ఒక చిన్న జట్టుగా బరిలోకి దిగి వరుస విజయాలను అందుకుంటూ సెమిస్ రేసులో పెద్ద జట్లకు సైతం చెమటలు పట్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ టీం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి.
ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన డికాక్ ఇప్పటి వరకు ఈ టోర్నీ 407 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు, విరాట్ కోహ్లీ354, డేవిడ్ వార్నర్ 332, రోహిత్ శర్మ 311,రిజ్వాన్ 302 పరుగులు చేసే టాప్ పొజిషన్ లో నిలిచారు.ఇక బౌలర్ల విషయానికి వస్తే ప్రతి టీంలో కూడా బౌలర్లు చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ వాళ్ళ టీం కి వరుస విజయాలను అందిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఆస్ట్రేలియా టీమ్ కు చెందిన ఆడమ్ జంపా మాత్రం వాళ్ళ టీం విజయంలో కీలకపాత్ర పోషిస్తూ మంచి విజయాలను అందిస్తున్నాడు… ఆడమ్ జంపా ఇప్పటికీ ఈ టోర్నీ లో 13 వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు.ఇక సాంట్నార్ 12 వికెట్లు తీయగా, బుమ్ర 11 వికెట్లు తీశాడు. ఇలా వీళ్ళు ముగ్గురు టాప్ త్రీ పొజిషన్ లో ఇప్పటివరకు కొనసాగుతున్నారు.
ఇక ఈ టోర్నీ ముగిసే సమయానికి ఎవరు టాప్ పోజిషన్ ని చేరుకుంటారు అనేది చూడాల్సి ఉంది అలాగే ఈసారి ఎవరు టైటిల్ కొడతారు అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో అంచనాలు మొత్తం తారుమారవుతున్నాయి రోజురోజుకీ ఒక్కొక్క జట్టు ఒక్కో టీం కి షాక్ లు ఇస్తుంది…