https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: నాగార్జునకే ఝలక్ ఇచ్చిన యావర్… అసలు ఊహించి ఉండరు!

ఎవిక్షన్ పాస్ పొందడానికి యావర్ ఆడిన గేమ్స్ అన్నిటికి సంబంధించిన వీడియోలు వేసి చూపించారు. కాగా అర్జున్ తో ఆడిన బాల్స్ గేమ్ లో కాళ్ళు కింద పెట్టిన వీడియో చూపించి, యావర్ ని నిలదీసాడు నాగ్.

Written By: , Updated On : November 19, 2023 / 09:51 AM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా కంటెస్టెంట్స్ ని వాయించేసాడు. ఎప్పుడు శివాజీని వెనకేసుకొచ్చే నాగార్జున .. ఈసారి శివాజీని కూడా ఉతికిపారేసాడు. అయితే ఇందులో భాగంగానే యావర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో యావర్ ఫౌల్ గేమ్ ఆడాడు అంటూ నాగార్జున షాకిచ్చాడు. కానీ .. అంతకంటే పెద్ద షాక్ ఇచ్చి నాగార్జున కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు యావర్.

అయితే ఎవిక్షన్ పాస్ పొందడానికి యావర్ ఆడిన గేమ్స్ అన్నిటికి సంబంధించిన వీడియోలు వేసి చూపించారు. కాగా అర్జున్ తో ఆడిన బాల్స్ గేమ్ లో కాళ్ళు కింద పెట్టిన వీడియో చూపించి, యావర్ ని నిలదీసాడు నాగ్. తర్వాత విల్లు టాస్క్ లోని ఫుటేజ్ చూపించి .. ఏవయ్యా శివాజీ .. యావర్ కోసం పోరాడావ్ కదా .. వీడియో చూస్తే నీకు ఏమనిపిస్తుంది’ అని అడిగారు. టైం టేకింగ్ లా అనిపించింది బాబు గారు అని అన్నాడు శివాజీ.

దాంతో ‘చూసావా .. యావర్ .. నీ కోసం పోరాడిన శివాజీకి కూడా నువ్వు సరిగా ఆడలేదని అంటున్నాడు. నువ్వు గెలిచినా తీరు కరెక్ట్ గా లేదు అని నాగార్జున చెప్పారు.దీంతో యావర్ ‘ నేను దీన్ని తీసుకోవడానికి అనర్హుడని అన్నప్పుడు ఇది నాకు అవసరం లేదు సార్ ఎవిక్షన్ పాస్ వెనక్కి ఇచ్చేస్తా’ అంటూ షాక్ ఇచ్చాడు.

ఇక నాగార్జున అది నీది కాబట్టి వెనక్కి ఇవ్వాలో లేదో నువ్వే డిసైడ్ చేసుకో అని అన్నాడు. దీంతో ఇది నాకు అవసరం లేదు అంటూ ఏవిక్షన్ పాస్ కింద పెట్టేసాడు. నువ్వు ఎవిక్షన్ పాస్ పొందడానికి అనర్హుడు అంటున్నావు కదా .. అయితే హౌస్ నిర్ణయం అడుగుదాం అంటూ నాగార్జున చెప్పారు. హౌస్లో మేట్స్ కొందరు ఎస్, కొందరు నో అన్నారు. యావర్ మాత్రం తనకు అవిక్షన్ పాస్ వద్దని చెప్పడంతో నాగార్జున వెనక్కి తీసేసుకున్నాడు. మరి ఈ పాస్ భవిష్యత్ లో వాడతారా లేక పూర్తిగా రద్దు చేస్తారా? అనేది చూడాలి.