Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున శనివారం స్పై బ్యాచ్ పై విరుచుకు పడ్డారు. ముఖ్యంగా శివాజీని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. దీంతో నాగార్జున పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. నిన్న అంతలా తిట్టిన నాగార్జున నేడు శివాజీని ఆకాశానికి ఎత్తేశారు. ఆదివారం ఎపిసోడ్లో ‘ ఈ 14 వారాల్లో ఇప్పటివరకు ఏ వీక్ లో మీ ఆట తీరు పై రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని కంటెస్టెంట్స్ ని అడిగారు నాగార్జున.
ముందుగా అర్జున్ 13వ వారం నాకు ఒకటే అనిపించింది సార్ .. ఉత్తి బలం ఉంటే సరిపోదు బలగం అంటే జనాల ప్రేమ కూడా ఉండాలని తెలిసొచ్చింది అని చెప్పాడు. ఇక శోభా అయితే 9వ వారంలో యావర్ ని పిచ్చోడు అని అనకుండా ఉండాల్సింది అని చెప్పింది. తర్వాత యావర్ మాట్లాడుతూ… నేను కావాలని ఫౌల్ చేయలేదు .. కానీ అది అలా జరిగిపోయింది అని చెప్పాడు. ఇక శివాజీ 14వ వారం నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పాడు.
ఈ వీక్ లో నేను వాడిన పదాలు నా వ్యక్తిగతం అని ఫీల్ అయ్యాను కానీ అది మిగతావాళ్ళకి కూడా టచ్ అవుతుందని మీరు చెప్పాకే అర్థమైంది .. నేను అన్నది పొరపాటు మాట అయుండొచ్చు కానీ అది తప్పుగా నేను ఒప్పుకుంటూనే గబుక్కున ఆ పదాలు వచ్చాయని శివాజీ చెప్పాడు. మా నమ్మకం కూడా అదే శివాజీ అని నాగార్జున అన్నారు. దీంతో శివాజీ నా దరిద్రం ఏంటంటే నేను నా కోసం స్టాండ్ తీసుకున్నపుడు ఏది జరగలేదు అని అన్నాడు.
వెంటనే నాగార్జున ‘ నువ్వు తీసుకున్న స్టాండ్ రైట్, నీ ఫీలింగ్ రైట్, నువ్వు ఆడుతున్న ఆట తీరు రైట్, నీ ఫిలాసఫీ రైట్ .. నువ్వు ఓట్ అప్పీల్ చేసినప్పుడు వాడిన ఒక పదం నాకు బాగా నచ్చింది. ‘బతుకు .. బతికించు’ అని నువ్వు చెప్పిన ఫిలాసఫీ అని నాకు అర్థమైంది అంటూ నాగార్జున ఆకాశానికి ఏత్తేసారు. కాగా శివాజీ-శోభ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో శోభ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.