https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ పై మీమ్స్ అదిరాయయ్యా బాసూ.. అమర్ జస్ట్ మీమ్ మెటీరియలా?

ముందుగా 'కంటెస్టెంట్స్ మిమ్మల్ని రిలాక్స్ చేసేందుకు కొన్ని మీమ్స్ చూపిస్తానంటూ' నాగార్జున చెప్పారు. ఇక వరుసగా మూడు మీమ్స్ ప్లే చేశారు. అవి చూస్తూ హౌస్ మేట్స్ తెగ ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2023 / 11:40 AM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నిన్నటి శనివారం ఎపిసోడ్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఊహించినట్లే నాగార్జున కంటెస్టెంట్స్ ని ఓ రేంజ్ లో ఉతికి ఆరేసాడు. ఎప్పుడూ లేనిది శోభా, శివాజీ లకు కూడా గట్టిగానే క్లాస్ పీకాడు. అమర్ దీప్ కి కూడా బాగా అక్షింతలు పడ్డాయి. అర్జున్, ప్రియాంక తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరికీ తిట్లు పడ్డాయి. అయితే శనివారం కంటెస్టెంట్స్ ని వాయించేసిన నాగార్జున .. ఆదివారం సండే ఫండే అంటూ సరదా గేమ్స్ ఆడిస్తూ సందడి చేశారు.

    ముందుగా ‘కంటెస్టెంట్స్ మిమ్మల్ని రిలాక్స్ చేసేందుకు కొన్ని మీమ్స్ చూపిస్తానంటూ’ నాగార్జున చెప్పారు. ఇక వరుసగా మూడు మీమ్స్ ప్లే చేశారు. అవి చూస్తూ హౌస్ మేట్స్ తెగ ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నారు. ఆ తర్వాత వాళ్లతో ఓ టాస్క్ ఆడించారు నాగ్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ కి కొన్ని మీమ్స్ ఇచ్చి వాటిని నచ్చిన వారికి డెడికేట్ చేయాలని చెప్పారు. కాగా ముందు ప్రియాంక ‘ ఇదేందయ్యా ఇది ఎప్పుడూ చూడలేదు ‘ ఈ మేము అమర్ కి ఇస్తున్న అని చెప్పింది.

    తర్వాత అర్జున్ .. యావర్ కి మీమ్ డెడికేట్ చేశాడు. ఇక చివర్లో ‘ సరే సరే లే .. ఎన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి’ అనే బాలయ్య బాబు ఫేమస్ మీమ్ అమర్ కి ఇచ్చాడు శివాజీ. ఇది భలే కరెక్ట్ గా సూట్ అయింది అంటూ నాగార్జున కౌంటర్ వేశాడు.

    అమర్ నువ్వు పూర్తిగా మీమ్ మెటీరియల్ అన్నమాట .. అంటూ నాగ్ పంచ్ వేశారు. ఆదివారం ఎపిసోడ్లో ఇలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక శోభ ఎలిమినేషన్ తో హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఈసారి ఆరుగురిని ఫైనలిస్ట్స్ గా నాగార్జున ప్రకటించారు. ఇక ఎలిమినేషన్ లేదని తెలుస్తుంది.