Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కావడంతో గుండెలు పిండేసే ఎమోషనల్ జర్నీ సాగుతుంది. ఫ్యామిలీ మెంబెర్స్ రాకతో హౌస్ మేట్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో గౌతమ్ తల్లి మంగాదేవి ఎంట్రీ ఇచ్చారు. కన్నయ్య .. కన్నయ్య పంచ వచ్చిందా అంటూ లోపలికి వచ్చింది. తల్లి మాట వినగానే పరుగున వెళ్లి ఆమెను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్.
తర్వాత ఆమె హౌస్ మేట్స్ అందరితో బాగా మాట్లాడారు. గౌతమ్ తో ‘నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు అని చెప్పింది. నాన్న వస్తాననలేదా.. మమ్మీ అంటూ గౌతమ్ అడిగాడు ‘అన్నాడు నిన్నటి దాకా వస్తాను అని అన్నాడు అని చెప్పింది గౌతమ్ తల్లి. ‘నువ్వు చేసింది చాలా కరెక్ట్ .. బాగా ఆడు .. అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ కొడుకు కి ధైర్యం చెప్పింది.
ఆ తర్వాత కొడుక్కి మాత్రమే కాకుండా ఇంటి సభ్యులందరికి గోరుముద్దలు పెట్టింది గౌతమ్ తల్లి. అందరితో సరదాగా మాట్లాడుతూ హౌస్ లో సందడి చేసింది. ఇక ఆమె బయటకు వెళ్తున్న సమయం లో ప్రిన్స్ యావర్ తన తల్లి గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో గౌతమ్ తల్లి యావర్ ని దగ్గరకు తీసుకుంది. ‘నువ్వు కూడా నా కొడుకువే .. మా ఇంటికి రా నాన్న’ అని యావర్ ని ఓదార్చింది.
ప్రిన్స్ యావర్ ఏడ్చిన సీన్ ప్రోమో హైలెట్ గా నిలిచింది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో కూడా చాలా ఎమోషనల్ డ్రామా నడిచింది. కంటెస్టెంట్స్ తో పాటు షో చూస్తున్న ఆడియన్స్ కి కూడా కళ్ళు చెమ్మగిల్లేలా ఉంది నిన్నటి ఎపిసోడ్. ఇక రోజు గౌతమ్ తల్లి మంగాదేవి రాకతో గౌతమ్ తో పాటు యావర్ కూడా భావోద్వేగానికి గురైయ్యాడు. ప్రోమో మాత్రం ‘ అమ్మ .. అమ్మ .. నీ వెన్నెల .. అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదిరిపోయింది.
🌟💖 Bigg Boss plans another beautiful surprise for Gautham! Gautham's mother steps into the Big Boss House, spreading love and care that leaves everyone emotional!#BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel
Link: https://t.co/CWJ1QlGWhf
— Starmaa (@StarMaa) November 8, 2023