Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఆరవ వారం లేడీ కంటెస్టెంట్ నయని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్క వారంలో ఇంటిని వీడటం ఊహించని పరిణామం. సోమవారం ఎపిసోడ్ హైలెట్స్ పరిశీలిస్తే… శివాజీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అందుకే బిగ్ బాస్ వైద్య పరీక్షల కోసం బయటకు పంపాడు. పరీక్షల అనంతరం రీఎంట్రీ ఇచ్చిన శివాజీ చేతికి సపోర్ట్ తో కనిపించారు. కెప్టెన్ యావర్ శివాజీని తన డిప్యూటీగా నియమించి రేషన్ బాధ్యతలు ఇచ్చాడు.
అనంతరం ఏడో వారానికి నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరూ సమానమే. ప్రతి హౌస్ మేట్ తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేసిన వారి ఎదుట ఉన్న కుండను బ్యాట్ తో బద్దలు కొట్టాలి. యావర్ కెప్టెన్ కావడంతో అతన్ని నామినేట్ చేయకూడదని చెప్పాడు. పల్లవి ప్రశాంత్ తో ప్రక్రియ మొదలైంది. అతడు సందీప్ ని నామినేట్ చేశాడు. ఒక కెప్టెన్ కి ఇజ్జత్ ఇవ్వలేదని అందుకే నామినేట్ చేశానని అన్నాడు.
ఈ విషయంలో సందీప్, పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టేస్టీ తేజాను కూడా నామినేట్ చేశాడు. తన అనుమతి లేకుండా కెప్టెన్ రూమ్ లోకి వచ్చాడని తేజాను నామినేట్ చేశాడు. అమర్ దీప్.. భోలే షావలి, అశ్విని శ్రీలను చేశాడు. వీరిద్దరూ మాటలు అనేస్తున్నారు. అలోచించి మాట్లాడటం లేదనే కారణంతో అమర్ దీప్ నామినేట్ చేశాడు. ఇక పూజా మూర్తి కూడా అశ్విని, భోలేలను నామినేట్ చేసింది. సందీప్… భోలే, ప్రశాంత్ లను నామినేట్ చేశాడు. మరోసారి పల్లవి ప్రశాంత్-సందీప్ మధ్య ఫైట్ జరిగింది. ఇద్దరూ చాలా సేపు వాదనకు దిగాడు.
అర్జున్ సైతం భోలే, అశ్వినిశ్రీలను నామినేట్ చేశాడు. వైల్డ్ కార్డు ఎంట్రీగా నన్ను నామినేట్ చేయడానికి పంపినట్లు ఉందని భోలే అసహనం వ్యక్తం చేశాడు. మీకు ఒక లక్ష్యం అంటూ లేదని కారణం చెప్పి అర్జున్ నామినేట్ చేశాడు. ప్రియాంక… భోలే, అశ్వినిలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రియాంక-భోలే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తేజా… పూజా, పల్లవి ప్రశాంత్ లను నామినేట్ చేశాడు. నాకు పూజా ఇచ్చిన పనిష్మెంట్ నచ్చలేదని తేజా కారణం చెప్పాడు.
సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే మెజారిటీ హౌస్ మేట్స్ అశ్విని శ్రీ, భోలేలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఈ వారం వారిద్దరూ నామినేట్ అవ్వడం ఖాయం. బహుశా ఈ వారం భోలేని ఇంటికి పంపే అవకాశం కలదు.