https://oktelugu.com/

Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ నామినేషన్స్ : ఏకంగా తలలు పగలుగొట్టుకున్నారు, రతిక-శోభ మధ్య దారుణం

నామినెట్ చేయాలనుకునే వాళ్ళ తలపై షుగర్ బాటిల్ పగలకొట్టి .. రీజన్ చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక రతిక రోజ్ ప్రియాంక,శోభా శెట్టి ని నామినేట్ చేసింది. శోభా తో ' నువ్వు కెప్టెన్ అయ్యి ఏం ఉద్దరించావ్ అని రతిక అడిగింది.'

Written By:
  • Neelambaram
  • , Updated On : November 13, 2023 / 04:49 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ హౌస్ నుంచి భోలే ఎలిమినేట్ కావడంతో మరో అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని తేలిపోయింది. కాగా పదకొండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కు రంగం సిద్ధమైంది. అయితే రతిక రోజ్, అర్జున్ నామినేషన్స్ లో రెచ్చిపోయారు. శోభా శెట్టి, ప్రియాంక కు చుక్కలు చూపించింది రతిక. ఇక అర్జున్ – పల్లవి ప్రశాంత్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఈనాటి ప్రోమోలో నామినేషన్లు ప్రారంభం అవ్వక ముందు శివాజీ ‘ నామినేషన్స్ లో నీ టాలెంట్ చూపించు .. అవతల వాళ్ళు నిన్ను క్వషన్ చేసే పరిస్థితి తెచ్చుకోకు .. అక్కడ నుంచి మొదలుపెట్టి గేమ్ ఎండింది వరకు నీ ఆట ఆపొద్దు’ అంటూ రతిక కి కోచింగ్ ఇచ్చాడు శివాజీ.

    నామినెట్ చేయాలనుకునే వాళ్ళ తలపై షుగర్ బాటిల్ పగలకొట్టి .. రీజన్ చెప్పాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక రతిక రోజ్ ప్రియాంక,శోభా శెట్టి ని నామినేట్ చేసింది. శోభా తో ‘ నువ్వు కెప్టెన్ అయ్యి ఏం ఉద్దరించావ్ అని రతిక అడిగింది.’ నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు .. టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను’ అని శోభా అంది. ఇక్కడ ఫిగర్స్ చెప్పడం కాదు .. ఏం చేసావో అది చెప్పు.. కెప్టెన్ అంటూ బ్యాడ్జ్ పెట్టుకుని తిరగడం కాదు అంటూ శోభా నోరు మూయించింది రతిక.

    ఆ తర్వాత ప్రియాంక ని నామినేట్ చేస్తూ ‘నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ‘ అని రతిక అనగానే .. ‘ నువ్వు టీచరు నేను స్టూడెంటూ నువ్వు అడిగినదానికి సమాధానం చెప్పుకుంటూ తిరగాలా అని ప్రియాంక అన్నది. ప్రియాంక .. ఆన్సర్ మై పాయింట్ అంటూ రతిక అరిచింది. తర్వాత అర్జున్ శోభా ని నామినేట్ చేశాడు. ‘ కెప్టెన్ గా అసలు నువ్వు కిచెన్ లో ఉన్నావా? విఐపి రూమ్ నుంచి బయటకు వచ్చావా అంటూ శోభ ను ఉతికి పారేశాడు అర్జున్.

    తర్వాత ప్రశాంత్ ని నామినేట్ చేశాడు అర్జున్. ‘ నీ అంతట నువ్వు ఎప్పుడైనా నామినేషన్ వేశావా అంటూ ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. నీకు తెలియదా .. బయట నుంచి చూసావుగా అని ప్రశాంత్ అన్నాడు. దీంతో ‘ గేమ్స్ ఆడమని శివాజీ చెప్పడం లేదు కదా అంటూ అర్జున్ రంకెలేశాడు. ఎప్పుడు కూల్ గా ఉండే అర్జున్ నామినేషన్స్ లో విజృంభించాడు. ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారని సమాచారం. శివాజీ, ప్రశాంత్ మినహాయించి అందరూ నామినేట్ అయ్యారట.