https://oktelugu.com/

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు హీరో రిషికి నిజంగానే ఆ చెడ్డ అలవాటు ఉందా?

రిషి పాత్రలో ఈయన అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ బుల్లితెర స్టార్ హీరోగా నిలిచాడు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి దర్శక నిర్మాతలు హీరోగా సినిమాలలో అవకాశాలు కల్పిస్తున్నారు కూడా.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 13, 2023 / 04:20 PM IST
    Follow us on

    Guppedantha Manasu Rishi: తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో ఛానెల్ లో ఎన్నో విభిన్న సీరియల్స్ వస్తున్నాయి. అయితే బుల్లితెరపై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న వాటిలో గుప్పెడంత మనుసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సీరియల్ ప్రారంభమవుతుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేస్తుంటారు అభిమానులు. ఈ సీరియల్ లో రిషి పాత్రలో ముఖేష్ గౌడ్ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు.

    రిషి పాత్రలో ఈయన అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ బుల్లితెర స్టార్ హీరోగా నిలిచాడు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి దర్శక నిర్మాతలు హీరోగా సినిమాలలో అవకాశాలు కల్పిస్తున్నారు కూడా. త్వరలోనే గీత శంకరం అనే సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇందులో బిజీ కానున్నాడు రిషి. అయితే ప్రియాంక శర్మ ముఖేష్ గౌడ్ హీరోహీరోయిన్ లు గతా గీత శంకరం అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా టైటిల్ పోస్టర్ తో సినిమాను కూడా ప్రకటించారు మేకర్స్.

    బుల్లితెర స్టార్ గా గుర్తింపు పొందిన రిషి త్వరలోనే వెండితెరపై మెరవడానికి సిద్దమయ్యాడు. ఇలాంటి ముఖేష్ గౌడ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించారు. వీటిని విన్న ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయినా ఏంటి ముఖేష్ ఇలా ఆలోచించాడా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. తనకు మొదట్లో తెలుగు అసలు నచ్చేది కాదట. తెలుగు రాకపోవడం వేరు. కానీ తెలుగు నచ్చకపోవడం వేరు. అందుకే ఈ మాట ఈ హీరో నుంచి విన్న అభిమానులు తెలుగులోనే స్టార్ గా నిలిచి తెలుగునే నచ్చలేదు అంటావా అని మండిపడుతున్నారు. కానీ అది మొదట్లో అని తెలిసి కాంప్రమైజ్ అవుతున్నారట అభిమానులు.

    రెండు తెలుగు రాష్ట్రాలలో నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారు చూపించే అభిమానం ముందు తెలుగు నేర్చుకోవాలని అనుకున్నాను అని తెలిపారు. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని తప్పులు వస్తాయట. వాటిని విన్న కొందరు తిడుతుంటారు అని అయినా కొంచెం కొంచెంగా తెలుగు నేర్చుకుంటున్నాను అని అన్నారు ముఖేష్. అంతేకాదు ఈయనకు మట్టి తినే అలవాటు ఉందట. చిన్నప్పుడు వర్షానికి వచ్చే మట్టి వాసన వల్ల దాన్ని తినేవాడట. ఇలా తనకు ఉన్న చెడు అలవాటును తెలిపాడు రిషి.