Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది.ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారం లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలో నామినేషన్స్ తో హీటెక్కిపోయిన హౌస్ ని కూల్ చేసేందుకు ఫన్నీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఒక స్పేస్ షిప్ బిగ్ బాస్ హౌస్ లో కూలిపోయింది. అందులో ఉన్న గ్రహాంతర వాసులని మెప్పిస్తే కంటెస్టెంట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ జిలేబి పురం -గులాబీ పురం అని రెండు టీమ్స్ గా విడిపోయారు. వాళ్ళకి కొన్ని పాత్రలు ఇచ్చారు.
ఆ పాత్రలు పోషిస్తూ నవ్వించడం తో పాటు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో ఆడి గెలవాలి. నిన్న జరిగిన ఎగ్ టాస్క్ లో జిలేబి పురం వాళ్ళు గెలిచారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో కంటెస్టెంట్స్ మరింత వినోదంగా కనిపించారు. ప్రియాంక వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి శివాజీ నోట్లో కిళ్ళీ పెడుతుంది. సర్పంచ్ శివాజీ ఎదో డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. ఇక మాజీ భార్యాభర్తలుగా ఉన్న తేజ,శోభా అందరిని నవ్వించారు.
ఈ రోజు కి మన ఫస్ట్ నైట్ జరిగి వన్ ఇయర్ అయింది. నీకు గుర్తుందా ఫస్ట్ నైట్ రోజు ఇదే డ్రెస్ వేసుకున్న అంటూ తేజ కామెడీ చేసాడు.ఇక శోభా వెంట పడే రోమియో గౌతమ్ కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తాడు. శోభా వెళ్లి గౌతమ్ ని కాపాడే ప్రయత్నం చేసింది. ఇది చూసి తేజ కిందపడిపోయాడు,ఇక అమర్ నోటితో గాలి ఊదే ప్రయత్నం చేశాడు. దీంతో అందరూ నవ్వు కున్నారు.
ఇక అర్జున్ తో తిరిగే చెంచా ప్రశాంత్, ప్రియాంకతో ‘నా దగ్గర ఒక యాభై ఎకరాలు ఉన్నాయి ‘అంటూ ఆమెని పడెయ్యాలని తెగ ట్రై చేసాడు. ప్రియాంక ‘ని చెంచా తిప్పాలనుకుంటే ఇక్కడ జరగవు ‘అని చెప్పింది. ప్రశాంత్ ఆర్టిస్ట్ కాకపోయినా చెంచా క్యారెక్టర్ లో బాగా నటించాడు.ఇలా ఒకరిని మించి ఒకరు యాక్టింగ్ అదరగొట్టేశారు.ఇక ఎపిసోడ్ చూస్తే ఆడియన్స్ కి ఫుల్ ఫన్. ఈ కెప్టెన్సీ టాస్క్ సీజన్ 7 లో ది బెస్ట్ టాస్క్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.