Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో మొదలై నాలుగు రోజులు అవుతుంది. అప్పుడే హౌస్ హీటెక్కిన సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం-మంగళవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. సాధారణంగా సోమవారమే నామినేషన్స్ కంప్లీట్ చేస్తారు. సీజన్ 7లో అది రెండు రోజులు జరిగింది. అత్యధికంగా నామినేట్ కాబడిన 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ లో ఉన్నారు.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, సింగర్ దామిని, నటి షకీలా, నటి కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతికా రోజ్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడాల్సి ఉంది. ఇక మంగళవారం అర్ధరాత్రి నుండి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ఓటింగ్ లో ఎవరు ముందున్నారు? ఎవరు వెనుకబడ్డారు? అనే విషయాలు లీకయ్యాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో మూడున్నాడట. అతనికి ఆడియన్స్ లో సానుభూతి ఉన్న నేపథ్యంలో అతనికి బాగా ఓట్లు పడుతున్నాయని అంటున్నారు. ఇక రెండో స్థానంలో కార్తీక దీపం శోభా శెట్టి ఉందట. వీరిద్దరూ ఓటింగ్ లో దూసుకుపోతున్నారట. వీరి తర్వాత రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని కొనసాగుతున్నారట. ఇక చివరి స్థానాల్లో ప్రిన్స్ యావర్, నటి కిరణ్ రాథోడ్ ఉన్నట్లు సమాచారం.
ఈ ఇద్దరు ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉన్నారు. ఆడియన్స్ ప్రేమను పొంది ఓట్లు రాబట్టేందుకు వాళ్లకు వారం రోజుల సమయం ఉంది. ఈ వారంలో మంచి పెర్ఫార్మన్స్ చూపితే ఓటింగ్ లో ముందుకు వెళ్లొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు. ఇప్పుడు వెనుకబడ్డ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ముందుకు రావచ్చు. కాగా ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలైంది. అంత ఉల్టా పుల్టా అంటూ నాగార్జున కాకరేపుతున్నారు.