Miss Shetty Mr Polishetty First Review: అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రాబోతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ అనుష్క నటిస్తున్న సినిమా ఇది. సరోగసీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తోన్నాడు. షూటింగ్ ఆలస్యం కావడం, పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదాపడటంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపై పెద్దగా బజ్ కనిపించడం లేదు.
మరోవైపు సినిమా ప్రమోషన్స్‌కు అనుష్క దూరం కావడం కూడా మైనస్‌గా మారింది. కానీ ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని ప్రమోట్ చేయడం ఈ చిత్రంకి మేజర్ ప్లస్ పాయింట్ అవ్వనుంది. అవును మీరు విన్నది నిజమే.. స్వయంగా చిరంజీవిని ఈ సినిమా చూసి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చి.. ఈ చిత్రాన్ని తనదైన స్టైల్ లో ప్రమోట్ చేశారు . ఇక అసలు విషయానికి వస్తే కుర్ర హీరోలను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే చిరంజీవి .. ఈ సినిమాను చూసి వెంటనే ట్విట్టర్లో తన రివ్యూ తెలియజేశారు.
‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి చూశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. జాతి రత్నాలు సినిమాకి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పొలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉన్న మనందరి ‘దేవసేన’ అనూష్క శెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు.ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అవడంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి 100 శాతం ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనడంలో సందేహం లేదు’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు చిత్ర యూనిట్ ని కలిసిన ఫోటోలు కూడా తన సోషల్ మీడియా అకౌంటులో షేర్ చేశారు చిరు.
ఇక ఈ సందర్భంగా అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, దర్శకుడు మహేష్ బాబు, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా, సంగీత దర్శకుడు రథన్, ఇతర చిత్ర బృందానికి చిరంజీవి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.