https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : తేజాకు బిగ్ బాస్ సపోర్ట్… అడ్డంగా దొరికిపోయారుగా!

ఎంటర్టైన్మెంట్ విషయంలో తేజ ఏమాత్రం తగ్గకుండా అందరిని నవ్వించాడు . ఓట్లు సంపాదించుకోడానికి ఒక మంచి అవకాశం

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2023 / 08:04 PM IST

    bigg boss testy teja

    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 ఐదో వారంలో ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్ళలో తేజ ముందుగానే హోస్ట్ ద్వారా , టాస్క్ లో చేసిన తప్పుకి డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడు . ముందు నుంచి తేజ కి తక్కువ ఓట్లు రావడంతో ప్రతి సారి డేంజర్ జోన్ లో ఉంటున్నాడు . ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లి తిరిగొస్తున్నాడు. గత వారం తేజ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనుకున్నారు అందరూ. కానీ రతిక మీద నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడంతో అది తేజ కి ప్లస్ పాయింట్ అయ్యింది.

    గత వారం సేఫ్ అవుతానని తేజ కూడా ఊహించలేకపోయాడు. తాను సేఫ్ అయ్యాడని నాగార్జున చెప్పగానే ఆశ్చర్య పోయాడు. ఈ వారం జైలు పనిష్మెంట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. ఇలాంటి తప్పులు మళ్లీ చెయ్యను నీకు సారీ చెప్తున్నా గౌతమ్ అంటూ హగ్ చేసుకున్నాడు. ఈ జైలు సీన్ కొంచెం ఆడియన్స్ లో సింపతీ గైన్ చేసింది .

    బిగ్ బాస్ కూడా తేజ కి స్కోప్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. లైవ్ ఎపిసోడ్ లో తేజ కి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న వాళ్ళకి వినోదాన్ని పంచి ఎంటర్టైన్ చెయ్యాలని స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. ఇది బుధవారం లైవ్ ఎపిసోడ్ లో ఇచ్చారు . ఈ టాస్క్ ద్వారా దాదాపు రెండు మూడు గంటలు తేజకి స్క్రీన్ స్పేస్ లభించింది. తన పర్సనల్ విషయాలు ,చదువు ,ఉద్యోగంలో జరిగిన ఫన్నీ థింగ్స్ అందరితో పంచుకున్నాడు.

    తన జీవితంలో జరిగిన గమ్మత్తయిన సంఘటనలు గురించి చెప్పుకొచ్చాడు. ఒక కంటెస్టెంట్ కి ఇన్ని గంటలు స్క్రీన్ స్పేస్ దొరకడం అంటే మామూలు విషయం కాదు . బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని బాగా వాడుకుని ఫుల్ ఫుటేజ్ ఇచ్చాడు తేజ. తేజ కి ఇది ప్లస్ పాయింట్ అయ్యి ఓట్లు పడితే ఈ వారం కూడా తేజ సేఫ్ అవకాశం వుంది . తేజ ని సేఫ్ చెయ్యాలనే ప్లాన్ లో బిగ్ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది అందుకే తేజకి ఇంత గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు . ఎంటర్టైన్మెంట్ విషయంలో తేజ ఏమాత్రం తగ్గకుండా అందరిని నవ్వించాడు . ఓట్లు సంపాదించుకోడానికి ఒక మంచి అవకాశం .