Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో శోభా ఎలిమినేషన్ తర్వాత టాప్ 6 ఫైనలిస్ట్ లను నాగార్జున ప్రకటించారు. సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. కాగా ఫినాలే వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ కోసం ఎమోషనల్ జర్నీ ప్లాన్ చేశారు బిగ్ బాస్. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో కాస్త ట్విస్ట్ ఇస్తూ టాప్ 6 కంటెస్టెంట్స్ ని ఫైనలిస్టులు గా చేశారు. ఇక ఫినాలే కి చేరిన వారి జర్నీ వీడియోలు చూపించే క్రమంలో అమర్ దీప్ గురించి బిగ్ బాస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. .
సోమవారం ఎపిసోడ్లో అమర్ తన ఫోటోలు చూస్తూ .. జరిగినవన్నీ గుర్తు చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ .. ‘ ‘అమర్ దీప్ అంటే .. ఎప్పటికీ వెలిగే జ్యోతి అని అర్థం’ అంటూ పేరుకు మీనింగ్ చెప్పారు. మీ బిగ్ బాస్ ప్రయాణంలో అదే ప్రతిబింబించింది. ఎలాగైనా ఆటలో గెలిచి .. చివరి వరకు చేరాలనే నీ తపన .. మీ చిన్న పిల్లాడి మనస్తత్వం .. మీ అల్లరిని .. మీ వెటకారాన్ని మీ స్నేహితుల కంటే ఎక్కువ అర్ధం చేసుకున్నాం.
మీ కట్టలు తెంచుకున్న భావోద్వేగాన్ని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కాపాడే కవచంలా మీ స్నేహితులు మారారు. మీలో ఆవేశం ఎంత ఉందొ వినోదం కూడా అంతే ఉందిని అందరూ ఒప్పుకోవాల్సిన.. విషయం పొరపాటు చేయని మనుషులు ఎవరూ లేరు. ఆ పొరపాట్లను తెలుసుకుని ముందుకు వెళ్లే వాళ్ళని ఎవరు ఆపలేరు’ అని బిగ్ బాస్ చెప్పారు.
ఇక ఆ మాటలు విని ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్. తన కెప్టెన్సీ పోయినప్పటి ఫోటో చూసి .. కెప్టెన్ పోయినప్పుడు అనుభవించిన వేదన అంతా ఇంతా కాదంటూ భావోద్వేగానికి గురైయ్యాడు అమర్ దీప్. అమర్ దీప్ జర్నీ వీడియో అతన్ని ఫిదా చేసింది. అమర్ దీప్ ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.