Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విజయంతంగా 8 వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్ హైలెట్స్ పరిశీలిస్తే… నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టే టాస్క్ పెట్టాడు. మీ షిప్ మునిగిపోయే పరిస్థితి వస్తే, ఒకరిని నీటిలోకి తోసేయాల్సి వస్తే ఎవరిని ముంచేస్తారు? ఎవరిని సేవ్ చేస్తారు? అని అడిగాడు. మొదటగా గౌతమ్ ని పిలిచి… అర్జున్, ప్రియాంకలలో ఎవరిని ముంచేస్తావని అడిగాడు. అర్జున్ ని ముంచేస్తాను. ప్రియాంకతో నాకు బాండింగ్ ఎక్కువ అన్నాడు.
తర్వాత అర్జున్ ని పిలిచి అమర్, గౌతమ్ పేర్లు చెప్పాడు. అమర్ ని ముంచేస్తానని అర్జున్ అన్నాడు. ఇక తేజా… శోభా, యావర్ లలో శోభను ముంచేస్తా అన్నాడు. యావర్ కి శివాజీ, రతిక పేర్లు చెప్పగా… ఇబ్బంది పడుతూ రతికను ముంచేస్తా అన్నాడు. ఈ క్రమంలో రతిక-యావర్ బాగా క్లోజ్ అయ్యారన్న డిస్కషన్ అక్కడ నడిచింది. శివాజీని పల్లవి ప్రశాంత్-యావర్ లలో ఎవరిని ముంచేస్తావు అంటే, యావర్ పేరు చెప్పాడు. ఈ గేమ్ లో తమ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరిని వదుకోవాల్సి రావడంతో హౌస్ మేట్స్ ఇబ్బందిపడ్డారు.
ఈ టాస్క్ అనంతరం రతిక మైండ్ మారింది. యావర్ తో తనకు ఎఫైర్ నడుస్తుందన్న అభిప్రాయం బలపడిందని ఆమె అర్థం చేసుకుంది. వెంటనే ఆమె మూడ్, గేమ్ మారిపోయాయి. నీ సపోర్ట్ నాకు అవసరం లేదు. నేను సింగిల్ గా ఆడతా. థాంక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్ అని సీరియస్ గా చెప్పింది. రతిక తనతో మాట్లాడదని యావర్ తెగ టెన్షన్ పడ్డాడు. ఇంట్లో ఏదో గొడవ జరిగినట్లు ఉందని నాగార్జున యావర్-రతికలను ఉద్దేశించి అన్నాడు.
తర్వాత మరో ఫన్నీ గేమ్ కండక్ట్ చేశారు. గేమ్స్ మధ్య ఒక్కొక్కరినీ నాగార్జున సేవ్ చేస్తూ వచ్చారు. శనివారం ప్రియాంక, గౌతమ్ సేవ్ అయ్యారు. మిగిలిన 6 మందిలో… అశ్విని, అమర్, శివాజీ వరుసగా సేవ్ అయ్యారు. భోలే కూడా అనంతరం సేవ్ అయ్యాడు. చివరికి సందీప్-శోభా మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున స్క్రీన్ పై ఇద్దరి హార్ట్ బీట్ కనిపిస్తుంది. ఎవరి హార్ట్ బీట్ ఆగుతుందో వారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పాడు.
స్క్రీన్ పై సందీప్ హార్ట్ బీట్ ఆగిపోగా నాగార్జున అతడు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. సందీప్ ఎలిమినేట్ కావడంతో తేజా బాగా ఎమోషనల్ అయ్యాడు. శోభా కూడా గట్టిగా ఏడ్చేసింది. అందరికీ గుడ్ బై చెప్పి సందీప్ ఇంటిని వీడాడు. ఈ వారం శోభా ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. చివర్లో సందీప్ పేరు తెరపైకి వచ్చింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More