Bigg Boss 7 Telugu: బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. నో ప్రైవసీ, నో ఫ్యామిలీ, నో ఎంటర్టైన్మెంట్, నో అదర్ ఆక్టివిటీస్.. చుట్టూ కెమెరాలు, 24 గంటల నిఘా. సిగిరెట్ తాగినా క్యాప్చర్ అవుతుంది. తిట్టినా, బూతులు మాట్లాడినా, మంచి చేసినా ఇలా ఏదైనా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే బిగ్ బాస్ దాన్ని మాత్రమే ప్రజలకు చూపిస్తారు.. క్యూరియాసిటీ పెంచుతారు. కేవలం బాత్ రూమ్ లో తప్ప మిగిలినా అన్ని చోట్ల కెమెరాలే ఉంటే కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కదా మరి. ఇంకో విషయం ఏంటంటే.. బాత్ రూమ్ లో కెమెరాలు లేవని ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. వెంట మైకులు ఉంటాయి కదా.. ఏం మాట్లాడినా రికార్డు అవుతుంది.
తుమ్మినా, దగ్గినా, ఏడ్చినా, నవ్వినా, ఇకఇకలు, పకపకలు చేసినా ఏది చేసినా కూడా కెమెరాలు కనిపెట్టుకొని కూర్చుంటాయి. అంతే కాదు గోక్కున్నా కూడా కెమెరాలకు చిక్కడం తథ్యం. అది బిగ్ బాస్ చూపిస్తారా లేదా అనే సెకండరీ.. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉంది ఎవరో కాదు శివాజీ.. పాపం శివాజీ ఎలా బుక్ అయ్యాడో చూడండి. ఫోటో ఎలా ఉందో వివరించాల్సిన అవసరం లేదు.. చిత్రం ఒకటి అయితే.. బిగ్ బాస్ వీడియో చూపించాక అది మరోలా అర్థం అయింది. అయినా ఏంటయ్యా శివాజీ కెమెరాలు ఉన్నాయన్న భయం లేకుండా ప్రపంచం చూస్తుంది అని తెలిసి ఇలా గోక్కోవడం ఏంటని ప్రతి ఒక్కరు తిట్టిపోస్తున్నారు కూడా.
నెటిజన్లు తిట్టిపోస్తే.. ట్రోలర్స్ కి అద్భుతమైన కంటెంట్ దొరికింది. శివాజీపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అట్లుంటుంది మరీ బిగ్ బాస్ తో… ఎదుటి వాళ్లను గోకినా.. దురదచ్చి గోకినా.. మూల్యం చెల్లించుకోక తప్పదు. అయినా బిగ్ బాస్ గురించి చాలా సింపుల్ గా అనుకుంటారు. తింటారు పడుకుంటారు లేస్తారు? తిన్నది అరిగేదాక గొడవలు, ఆటలు, లేదా లవ్ ట్రాకులు ఇంకేముంది ఈ బిగ్ బాస్ ఇంట్లో.. అని ఈజీగా మాట్లాడేస్తుంటారు కొందరు. కానీ చూశారా ఎంత కష్టమో ఆ ఇంట్లో ఉండడం. సీరియల్స్ లో సినిమాల్లో అయితే కేవలం షూట్ ఒకే అయితేనే సీన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేసినా సీనే అవుతుంది. అదే బిగ్ బాస్ నిర్వాహకులకు టీఆర్పీని తెచ్చిపెడుతుంది.
కుదురుగా ఉండనివ్వడు బిగ్ బాస్.. బిగ్ బాస్ ఉంచినా కూడా కంటెస్టెంట్స్ ఉండనివ్వరు. హౌస్‌లో ఉన్న వాళ్లు ఇలా.. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ.. బిగ్ బాస్ హౌస్‌లో సైకోలుగా మారుతుంటారు. ఈ సీజన్‌లో అయితే మోనిత, రతిక, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ ఇలా చాలామంది సైకోలు ఒక్కొక్కరుగా తమ సైకోయిజాన్ని బయటకు తీస్తున్నారు. కానీ ఏంటయ్య బిగ్ బాస్ ఇది.. మరీ ఇంత దారుణంగా బుక్ చేస్తారా? పాపం శివాజీ ఈ వీడియో చూస్తే ఎలా ఫీల్ అవుతాడో ఏంటో? అయినా వాళ్ల ఇంట్లో వాళ్లు, అభిమానులు ఎలా బాధపడుతున్నారో? కాస్తైనా ఆలోచించవా పెద్దమనిషి అంటూ తెగ తిట్టిపోస్తున్నారు బిగ్ బాస్ ను నెటిజన్లు..