https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: వేదికపైకి శ్రీకాంత్… ఆ మాట అనడంతో బయటకు వెళ్ళిపోతానని తలబాదుకున్న శివాజీ!

సినిమా పేరు కోట బొమ్మాలి పిఎస్ .. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటూ సినిమా గురించి శ్రీకాంత్ చెప్పారు. ' నువ్వు చూస్తావా ఎప్పుడైనా బిగ్ బాస్ 'అని నాగార్జున అనగానే 'ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు అని శ్రీకాంత్ చెప్పాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 19, 2023 / 05:19 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులందరినీ వాయించి పారేసాడు. కాగా నేడు సండే కావడంతో స్పెషల్ గెస్టులతో ఎంట్రీ ఇచ్చారు. తాజా ప్రోమోలో కోట బొమ్మాలి పిఎస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు మేక శ్రీకాంత్, నటి వరలక్ష్మి .. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ గా నటిస్తున్న రాహుల్ విజయ్ – శివాని రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా గురించి చెప్పమంటూ నాగార్జున అడిగాడు.

    సినిమా పేరు కోట బొమ్మాలి పిఎస్ .. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటూ సినిమా గురించి శ్రీకాంత్ చెప్పారు. ‘ నువ్వు చూస్తావా ఎప్పుడైనా బిగ్ బాస్ ‘అని నాగార్జున అనగానే ‘ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు అని శ్రీకాంత్ చెప్పాడు. ఆ తర్వాత ‘ మీకు హుషారు రావాలని నాతోపాటు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చా.. చూపించనా వాళ్ళని .. శివాజీకి అయితే బాగా ఫ్రెండ్ అని చెప్తూ గెస్టులని చూపించాడు.

    అందరికీ హాయ్ చెప్పిన శ్రీకాంత్ ‘శివాజీ కొంచెం పక్కకి రా’ అని పిలిచాడు. ‘ ఇన్ని వారాలు ఎలా ఉండగలిగావ్ అయ్యా అని అనడంతో .. శివాజీ ఏదో చెప్పబోయాడు. దీంతో ‘ శివాజీ… శ్రీకాంత్ కి తెలియందే లేదు అని నాగార్జున చెప్పారు. ‘ ఏడు సీజన్లు వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు.. కానీ శివాజీ నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్ .. చాణక్యుడు .. ఇప్పుడు చంద్రగుప్తుడు కూడా అయ్యాడు అంటూ శివాజీని ఆకాశానికి ఎత్తేశారు శ్రీకాంత్.

    తర్వాత అమర్ గురించి మాట్లాడుతూ ‘ బాబు నువ్వు లక్కు లేదని ఒకటి మైండ్ లో పెట్టేసుకున్నావ్ .. ముందు కష్టపడు తర్వాత లక్ అదే వస్తుంది అని అన్నాడు. శోభా శెట్టి ఒక క్రాకర్ అంటూ పొగిడాడు.’ సార్ వీళ్ళు ఎవరు సార్ .. ఎందుకొచ్చారు సార్ అంటూ శివాజీ అడిగాడు .. ఎందుకొచ్చాము అంటే .. నిన్ను చూడటానికి వచ్చాము అంటూ శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చాడు.వీళ్లు సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు అంటూ నాగార్జున చెప్పారు.

    సార్ జిమ్ లో చూసి మీకంటే శివాజీనే పెద్ద అనుకున్న సార్ అంటూ అర్జున్ చెప్పాడు. అవును బయట కూడా అదే అనుకుంటున్నారు .. అందరూ కలిసి పెద్దయ్యని చేసేసారుగా అని శ్రీకాంత్ అనడంతో … తలుపులు తీస్తే వెళ్ళిపోతాను సార్ .. ఇది నరకంగా ఉంది అంటూ శివాజీ జోక్ చేసాడు. ఇది శివాజీ వాడే కామన్ డైలాగ్. ఫ్యామిలీ వీక్ లో శివాజీ కొడుకు రిక్కీ .. ఇంకోసారి వెళ్ళిపోతాను అని అనొద్దు నాన్న అంటూ గట్టిగా చెప్పాడు. కానీ ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు.ఇప్పుడు సరదాగా అన్నాడు. కానీ ఇంతకు ముందు చాలా సార్లు సీరియస్ గానే ఈ మాట అన్నారు.