Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వచ్చిందంటే యూట్యూబర్స్, మీమ్ పేజెస్ యజమానులకు పండగే. ఈ మూడు నెలలు వాళ్లకు సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. బిగ్ బాస్ రివ్యూలతో పాటు మీమర్స్ వీడియోలకు భారీ డిమాండ్ ఉంటుంది. హౌస్ లో చోటు చేసుకునే ఎమోషన్స్, గేమ్, కామెంట్స్ ఆధారంగా వీరు పండించే కామెడీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7 ఫ్యామిలీ వీక్ కి చేరుకుంది. అనగా ప్రతి హౌస్ మేట్ కుటుంబ సభ్యుల్లో ఒకరు కలిసేందుకు వస్తారు.
మంగళవారం ఎపిసోడ్లో శివాజీ కొడుకు కెన్నీ, అర్జున్ భార్య సురేఖ, అశ్విని తల్లి వచ్చారు. హౌస్లో ఎమోషనల్ డ్రామా చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులను హట్టిగా హత్తుకుని కన్నీరు మున్నీరు అయ్యారు కంటెస్టెంట్స్. ఈ మెలో డ్రామా మీద పదుల సంఖ్యలో మీమ్స్ పుట్టుకొచ్చాయి. కొడుకు వచ్చినందుకు శివాజీ కంటే శోభ ఎక్కువ ఎగ్జైట్ అయ్యింది. కేకలు వేస్తూ, గాల్లోకి ఎగురుతూ ఆమె చేసింది అతి కాదు… అంతకు మించి.
అలాగే శివాజీకి కెన్నీ సలహాలు ఇచ్చాడు. ఎవరు రెచ్చగొట్టినా ఓవర్ గారు రియాక్ట్ అవకు అని చెప్పాడు. నాకు తెలుసులేరా… ఇన్ని రోజులు మీరు చెబితేనే నేను ఆడానా? అంటూ శివాజీ నాకు అంతా తెలుసనే ఆత్మవిశ్వాసం ప్రకటించాడు. శివాజీ చేతిని కొడుకు కెన్నీ గీరడం బిగ్ బాస్ హైలెట్ చేసి చూపించాడు. దీంతో ఏదో హింట్ ఇచ్చాడని టాక్.
అర్జున్ భార్యకు సీమంతం జరిగింది. శివాజీ కొడుకు ఎక్కువగా రియాక్ట్ కావొద్దని సలహా ఇస్తే… అర్జున్ భార్య సురేఖ మాత్రం రియాక్ట్ అవమని చెప్పింది. నువ్వు కామ్ గా ఉంటే నచ్చడం లేదని చెప్పింది. అశ్విని మదర్ కూతురికి ధైర్యం చెప్పింది. ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ పై ఓ యూట్యూబ్ మీమ్ వీడియో నవ్వులు పూయిస్తోంది. అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…
https://youtu.be/oX_zd-b7uj0?si=RWSs2TXDFJ4AxHrC