Srihan- Sri Satya: గత వారంలో లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్కు హోరాహోరీగా సాగింది..’ల్యాడర్ vs స్నేక్’ (నిచ్చెన వర్సెస్ పాము) గేమ్ లో ఎలిమినేట్ అయినా వాసంతి , శ్రీ సత్య , రోహిత్ , ఇనాయ కోసం మళ్ళీ కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కలిపిస్తాడు బిగ్ బాస్..అందులో భాగంగా ‘స్టిక్కీ సిట్యుయేషన్’ అనే టాస్కుని ఇస్తాడు.. ఈ టాస్కులో భాగంగా నలుగురు సభ్యులు వీలైనన్ని ఎక్కువ స్టిక్కర్లు ప్రత్యర్థి టీ షర్ట్ పై అతికించాల్సి ఉంటుంది.

టాస్క్ ముగిసే సమయానికి ఏ ఇద్దరి టీ షర్ట్స్ మీద తక్కువ స్టిక్కర్లు అతికి ఉంటాయో ఆ ఇద్దరు కెప్టెన్సీ పోటీదారుల రేసులోకి ముందుకు వెళ్తారు..ఈ టాస్కుకి రేవంత్ సంచలకుడిగా వ్యవహరించాడు..టాస్కు చివరి వరుకు తక్కువ స్టిక్కర్లు ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ గా రోహిత్ – శ్రీ సత్య నిలుస్తారు..వీళ్ళు తదుపరి ఆడబొయే ‘నాగమణి’ టాస్కుకి క్వాలిఫై అవుతారు..ఈ టాస్కు చాలా రసవత్తరంగా ఎన్నో గొడవల మధ్య సాగుతుంది.
ఈ టాస్కులో స్నేక్ టీం వారు గెలవగా.. ల్యాడర్ టీం వారు ఓడిపోతారు..అయితే ల్యాడర్ టీంకి బంగారు నాగమణి దక్కడం వల్ల ఆ టీం నుండి ఒకరికి కెప్టెన్సీ టాస్కులో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తాడు బిగ్ బాస్..ఇప్పటి వరకు మెరీనా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి టీం మొత్తం మెరీనా ని కెప్టెన్సీ కంటెండర్ గా పంపించడానికినిర్ణయం తీసుకుంటుంది.

అయితే గత వీకెండ్ లో నాగార్జున పనిష్మెంట్ క్రింద శ్రీహాన్ కి కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు వీలు లేదని బిగ్ బాస్ కి చెప్తాడు కదా.. అది ఈ సందర్భంలో బిగ్ బాస్ గుర్తు చేసి నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ లేదు..నీ బదులు ఎవరినైనా పంపించు అని చెప్తాడు.. అప్పుడు శ్రీహాన్ నిమిషం కూడా ఆలోచించకుండా శ్రీసత్య పేరు చెప్తాడు.. అలా శ్రీసత్య మరోసారి కెప్టెన్సీ టాస్కు పోటీదారులతో ఒకరిగా నిలిచింది.. మరి వీరిలో ఎవరు ఈ పోటీ లో గెలిచి కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపడతారో రేపు చూడాలి.