Inaya Sultana- Sri Satya: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు చాలా రసవత్తరం గా సాగుతున్న సంగతి తెలిసిందే..వివిధ లెవెల్స్ ని దాటుకొని ఈ టాస్కు ఇప్పుడు పీక్ లెవెల్ కి చేరుకుంది..అందరికంటే తక్కువ పాయింట్స్ వచ్చిన కారణంగా కీర్తి ని ఈ ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు నుండి బిగ్ బాస్ నిన్న తొలగించేసాడు..ఇక మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు..అయితే తదుపరి లెవెల్ కోసం ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో కేవలం ముగ్గురు మాత్రమే టాస్కుని ఆడాల్సి ఉంటుంది.

సంచాలక్స్ గా వ్యవహరిస్తున్న కీర్తి , శ్రీ సత్య మరియు ఇనాయ ని ఏకాభిప్రాయం తో నిర్ణయం తీసుకోమంటాడు బిగ్ బాస్..అప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి టాప్ పాయింట్స్ తో ఉన్న ఆది రెడ్డి మరియు శ్రీహాన్ ని తొలగిస్తారు..ఇది సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి సంచాలక్స్ గా వ్యవహరించిన శ్రీ సత్య – కీర్తి – ఇనాయ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.
సంచాలక్స్ గా వీళ్ళు ఇప్పుడు తీసుకున్నంత దరిద్రంగా నిర్ణయం బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరు తీసుకోలేదు అంటూ నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు..మొదట్లో తక్కువ పాయింట్స్ ఉన్నవాళ్ళని తదుపరి టాస్కు నుండి తొలగించాము..ఇప్పుడు తక్కువ పాయింట్స్ ఉన్న కంటెస్టెంట్స్ కి అవకాశం కల్పించి , ఎక్కువ పాయింట్స్ ఉన్నవాళ్ళని తొలగిస్తున్నాము అంటూ సంచాలక్స్ తీసుకున్న నిర్ణయాన్ని శ్రీహాన్ , ఆది రెడ్డి చాలా తీవ్ర స్థాయి లో వ్యతిరేకిస్తారు..ఇంత కస్టపడి ఆడి పాయింట్స్ గెలుచుకున్న మేము పిచోళ్లమా!, మాకంటే తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఈ టాస్కు ఆడి మమల్ని దాటేస్తే అదెక్కడి న్యాయం అంటూ విరుచుకుపడుతారు.

అలా వాదనలు జరుగుతున్న సమయం లో రోహిత్ ‘ఈ టాస్కులో నేను కొనసాగడం నాకు న్యాయం అనిపించడం లేదు..నేను స్వచ్చందంగా ఈ టాస్కు నుండి తప్పుకుంటున్నాను’ అని అంటాడు..అప్పుడు సంచాలక్ ఇనాయ మాట్లాడుతూ ‘గేమ్ ఆడాను అని చెప్పి వెళ్ళిపోతున్నావా ఇంకా’ అని అంటుంది.
అప్పుడు రోహిత్ దానికి సమాధానం ఇస్తూ ‘గేమ్ ఆడాలి..కానీ ఫెయిర్ గా కూడా ఉండాలి..ఇలాంటి గేమ్ ఆడితే నాకే నచ్చదు..ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి అన్ ఫెయిర్ అయిపోతుంది క్లియర్ గా..ఏకాభిప్రాయం అంటే మీ థింకింగ్ ఏమిటి..ఏకాభిప్రాయం అంటే అవకాశం ఇవ్వడం కాదు’ అని అంటాడు..రోహిత్ మాట్లాడిన ఈ మాటలకు నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.